T20 World Cup-2022: సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’: ఇంగ్లండ్ కెప్టెన్ అంచనా

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కుతుందని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అంచనా వేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ 239 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. అతడి స్ట్రైక్ రేట్ 189.68గా ఉంది. టీ20 ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం ఐసీసీ నిన్న 9 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.

T20 World Cup-2022: సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’: ఇంగ్లండ్ కెప్టెన్ అంచనా

Suryakumar Yadav

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కుతుందని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అంచనా వేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ 239 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. అతడి స్ట్రైక్ రేట్ 189.68గా ఉంది. టీ20 ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం ఐసీసీ నిన్న 9 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.

అభిమానులు ఓట్లు వేయవచ్చని చెప్పింది. ఆ 9 మందిలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పాక్ క్రికెటర్లు షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రన్, ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్, జింబాబ్బే ఆల్ రౌండర్ సికందర్ రజా, శ్రీలంక ఆల్ రౌండర్ హసరంగా ఉన్నారు. 296 పరుగులతో ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎవరు నిలుస్తారన్న విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పేరును చెప్పాడు. ‘‘సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా స్వేచ్ఛగా ఆడాడని నేను భావిస్తున్నాను. అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకున్నాడు. అందుకే అతడిని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కాలని భావిస్తున్నాను’’ అని చెప్పాడు.

అలాగే, తమ జట్టులోని సామ్ కుర్రాన్, తాను, అలెక్స్ హేల్ కు కూడా ఆ అవార్డు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. వారు ఫైనల్లో రాణిస్తే వారిలో ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కుతుందని చెప్పాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..