T20 World Cup 2022: నిన్నటి మ్యాచులో విరాట్ కోహ్లీ ‘ఫేక్ ఫీల్డింగ్’కు పాల్పడ్డాడని ఆరోపణలు.. వీడియో వైరల్

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నిన్న అడిలైడ్ ఓవల్ లో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాటర్ నూరుల్ హసన్ ఆరోపించాడు. దీన్ని ఫీల్డ్ అంపైర్లు కూడా గమనించలేదని చెప్పాడు. దీంతో తాము పరుగులు నష్టబోయామని తెలిపాడు. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

T20 World Cup 2022: నిన్నటి మ్యాచులో విరాట్ కోహ్లీ ‘ఫేక్ ఫీల్డింగ్’కు పాల్పడ్డాడని ఆరోపణలు.. వీడియో వైరల్

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నిన్న అడిలైడ్ ఓవల్ లో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాటర్ నూరుల్ హసన్ ఆరోపించాడు. దీన్ని ఫీల్డ్ అంపైర్లు కూడా గమనించలేదని చెప్పాడు. దీంతో తాము పరుగులు నష్టబోయామని తెలిపాడు. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వర్షం కారణంగా నిన్న మ్యాచును 16 ఓవర్లకు కుదించి, బంగ్లాదేశ్ కు 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్ 6.2 ఓవర్ల వద్ద 62 పరుగులతో క్రీజులో ఉంది. బంగ్లాదేశ్ ఓపెనర్ బాదిన బంతి బౌండరీ వైపున వెళ్లగా దాన్ని ఆర్ష్ దీప్ నిలువరించి వికెట్ల వైపుగా విసిరాడు. ఆ సమయంలో వికెట్లకు దగ్గరలో ఉన్న కోహ్లీ ఆ బంతిని పట్టుకుని విసిరేస్తున్నట్లు నటించాడు. అయితే, ఆ బంతిని కోహ్లీ పట్టుకోలేదు.

ఆ బంతి కోహ్లీ వెనుక నుంచి వెళ్లగా మరో ఫీల్డర్ దాన్ని పట్టుకున్నాడు. దీనిపైనే నూరుల్ హసన్ అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ‘‘వర్షం తర్వాత తడిగా ఉన్న మైదానంలో తిరిగి ఆట ప్రారంభమైంది. దీంతో బంగ్లాదేశ్ పై ప్రతికూల ప్రభావం పడింది. అంతేగాక భారత ఆటగాడు ఫేక్ త్రో వేశాడు. దాన్ని అంపైర్లు గుర్తిస్తే మాకు 5 పరుగులు వచ్చేవి. మాకు అవి కూడా రాకుండాపోయాయి’’ అని నూరుల్ హసన్ అన్నాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..