T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాలో మార్పు.. ఫైనల్ జట్టు ఇదే!

UAEలో జరుగుతున్న IPL చివరకు వచ్చేసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15వ తేదీన జరగబోతుంది.

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాలో మార్పు.. ఫైనల్ జట్టు ఇదే!

T20 World Cup: UAEలో జరుగుతున్న IPL చివరకు వచ్చేసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15వ తేదీన జరగబోతుంది. సరిగ్గా రెండు రోజుల తర్వాత, టీ20 ప్రపంచకప్ ఇవే పిచ్‌లపై ప్రారంభం అవుతుంది. టీ20 వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ అయిన ఆటగాళ్లందరూ దాదాపు నెలరోజులుగా ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ప్రపంచకప్‌లో ఈ అనుభవం భారత జట్టుకు బాగా పనికొస్తుంది.

ఈ క్రమంలోనే భారత జట్టు టీ20 వరల్డ్ కప్ జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మార్పు చేసింది. అక్షర్ పటేల్ స్థానంలో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ జట్టులోకి తీసుకుంది. ఇంతకుముందు 15 మంది జట్టులో శార్దూల్ లేడు. స్టాండ్‌బై ప్లేయర్‌గా జట్టులో ఉండగా.. ఇప్పుడు ఫైనల్ జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. 15 మంది సభ్యుల జట్టులో శార్దూల్ ఠాకూర్‌ను చేర్చి.. ఆక్షర్ పటేల్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా జట్టులో పెట్టింది బీసీసీఐ. 2021 టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

టీ20 ప్రపంచకప్‌లో భారత ప్లేయర్లు:(15 Members)
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌-కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌(వికెట్ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌, హర్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్, మహమ్మద్‌ షమి

స్టాండ్‌-బై ప్లేయర్లు:
శ్రేయస్‌ అయ్యర్, దీపక్‌ చాహర్‌, అక్షర్ పటేల్‌

IPL 2021లో అద్భుతంగా రాణించిన శార్దూల్:
ఐపీఎల్ 2021లో ఇప్పటివరకు శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా రాణించారు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో శార్దూల్ కీలక పాత్ర పోషించారు. శార్దూల్ ఐపిఎల్ 2021లో 15 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు.