Taapsee Pannu : రష్యా వీధుల్లో తాప్సీ..

ఫారెన్‌లో క్రేజీ క్రేజీ పనులు చేస్తున్న తాప్సీ, తన డ్రెస్సింగ్‌తో మాత్రం అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది..

Taapsee Pannu : రష్యా వీధుల్లో తాప్సీ..

Taapsee Pannu

Taapsee Pannu: స్టార్ హీరోయిన్లకు కూడా లేనన్ని సినిమాలు చేస్తూ.. బిజీగా ఉంది తాప్సీ.. కోవిడ్ బ్రేక్ తీసుకుని ఫారెన్ చెక్కేసిన తాప్సీ.. అక్కడ రోడ్ల మీద ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. అంతే కాదు.. ఫారెన్‌లో క్రేజీ క్రేజీ పనులు చేస్తున్న తాప్సీ, తన డ్రెస్సింగ్‌తో మాత్రం అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది.

హీరోయిన్‌గా పనికి రాదన్నారు.. అసలు ఎవరు హీరోయిన్‌గా ఆఫరిస్తారా చూద్దాం అనుకున్నారు. తీరా హీరోయిన్ అయ్యాక పెద్దగా సినిమాలు లేక ఫేడవుట్ అయ్యిందన్నారు. అదే హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఈ సినిమాల నుంచి, కోవిడ్ నుంచి బ్రేక్ తీసుకుని ఫారెన్ చెక్కేసింది తాప్సీ.

రష్యాలో తన చెల్లెలితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది తాప్సీ పన్ను. తాప్సీ ఫస్ట్ నుంచి సెలక్టివే. ఇండస్ట్రీలో ఎవరికీ భయపడకుండా ఇండిపెండెంట్‌గా ఆఫర్లు దక్కించుకుంటూ క్రేజ్ సంపాదించుకున్న తాప్సీ.. రష్యాలో క్రేజీ క్రేజీ పనులు చేస్తోంది. రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్‌లో రోడ్ల మీద చీరకట్టుతో ఫ్యాన్స్‌ని ఖుష్ చేసింది తాప్సీ.

వైట్ శారీ, కాంట్రాస్ట్ ట్రెండీ బ్లూ కలర్ బ్లౌజ్‌తో గాజులు.. వీటితో పాటు షేడ్స్, షూస్ వేసుకుని ఇండో వెస్ట్రన్ లుక్‌లో క్రేజీగా కనిపించింది తాప్సీ. అంతేకాదు, ఈ ట్రిప్‌లో అంతకుముందు రష్యా రోడ్ల మీద దిగిన ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాప్సీ లుక్ చూసి నెటిజన్స్ అయితే తెగ ఫిదా అయిపోతున్నారు. ఇక ‘హసీన్ దిల్ రుబా’, ‘లూప్ లపేటా’, ‘రష్మి రాకెట్’, ‘శభాష్ మిధు’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది తాప్సీ. ఈ ట్రిప్ నుంచి వచ్చాక మళ్లీ షూట్‌లో బిజీ కాబోతోంది ఈ ముద్దుగుమ్మ.