India iPhone Users : భారత్‌లో ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో 5Gని ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా?

India iPhone Users : భారత మార్కెట్లో ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) నుంచి 5G సర్వీసులను పొందే అవకాశం ఉంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కొన్ని వారాల క్రితం ఎంపిక చేసిన నగరాల్లో తమ 5G సర్వీసులను ప్రారంభించాయి.

India iPhone Users : భారత్‌లో ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో 5Gని ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా?

Take note iPhone users in India, now you can use Airtel or Jio 5G if you follow these steps

India iPhone Users : భారత మార్కెట్లో ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) నుంచి 5G సర్వీసులను పొందే అవకాశం ఉంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కొన్ని వారాల క్రితం ఎంపిక చేసిన నగరాల్లో తమ 5G సర్వీసులను ప్రారంభించాయి. 5G-రెడీ స్మార్ట్‌ఫోన్‌లు iPhoneలు మినహా 5G సర్వీసులను సులభంగా అమలు చేసేందుకు వాటి తయారీదారుల నుంచి కొత్త అప్‌డేట్ పొందాయి. Apple చివరకు బ్యాండ్‌వాగన్‌లో చేరింది. బీటా యూజర్ల కోసం iOS 16.2 అప్‌డేట్‌ను అందించనుంది.

iOS 16.2 బీటా iPhone 14, iPhone 13, iPhone 12, iPhone SE (3వ జనరేషన్) మోడల్‌లకు అందుబాటులోకి వస్తోంది. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ మోడల్‌లను కలిగిన బీటా యూజర్లు తమ ఫోన్‌లలో 5Gని పొందవచ్చు. అర్హత కలిగిన iOS 16 బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ సబ్‌స్క్రైబర్‌లకు అప్‌డేట్ దశలవారీగా రిలీజ్ చేయనుంది. కొంతమంది యూజర్లకు అప్‌డేట్ పొందేందుకు కొంత సమయం పట్టవచ్చు. ఇప్పుడు, మీకు అర్హత ఉన్న iPhone మోడల్‌లలో ఒకటి ఉంటే.. అర్హత కలిగిన iOS 16 బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో భాగమైతే, మీ iPhoneలో 5Gని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

Take note iPhone users in India, now you can use Airtel or Jio 5G if you follow these steps

Take note iPhone users in India, now you can use Airtel or Jio 5G if you follow these steps

మీ iPhoneలో 5Gని ఎలా యాక్టివేట్ చేయాలంటే? :
మీరు ఇప్పటికే బీటా ప్రోగ్రామ్‌లో భాగమైతే.. ముందుగా లేటెస్ట్ బీటా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చెక్ చేయండి. యూజర్లు కేవలం అందుబాటులో ఉన్న అప్‌డేట్ కోసం చెక్ చేయడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై Tap చేయండి. అప్‌డేట్ అందుబాటులోఉంటే.. దాన్ని ఇన్‌స్టాల్ చేసేందుకు డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయండి. iOSలో ఏదైనా బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు మొత్తం డేటా, ఫైల్‌లను బ్యాకప్ చేయవచ్చు. యూజర్లు వ్యక్తిగత వివరాలను కోల్పోకుండా సాయపడుతుంది. బీటా అప్‌డేట్‌లు బగ్‌లతో వస్తాయి. కాబట్టి మీ ప్రైమరీ డివైజ్‌లో iOS అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయకపోవడమే మంచిది. మీరు అలా చేయాలనుకుంటే.. మీ సొంత రిస్క్ తో చేయాల్సి ఉంటుంది.

బీట్ ప్రోగ్రామ్‌లో భాగం కావాలంటే? :

* మీ iPhoneలో beta.apple.com/profileకి వెళ్లండి.
* కాన్ఫిగరేషన్ ప్రొఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
* ప్రొఫైల్‌ను ప్రారంభించడానికి సెట్టింగ్‌లకు వెళ్లండి.
* General> VPN డివైజ్ మేనేజ్‌మెంట్ వెళ్లండి> iOS 16 బీటాపై Tap చేయండి.
* ఇప్పుడు బీటా వెర్షన్ సెట్టింగ్‌ల యాప్‌లో General > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కింద అందుబాటులో ఉంటుంది.
* మీరు iOS 16 బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో భాగమైన తర్వాత 5G నెట్‌వర్క్ మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే దానికి కనెక్ట్ చేయవచ్చు.
* 5G నెట్‌వర్క్‌ని చెక్ చేసి, కనెక్ట్ చేయవచ్చు.

Take note iPhone users in India, now you can use Airtel or Jio 5G if you follow these steps

Take note iPhone users in India, now you can use Airtel or Jio 5G if you follow these steps

Settings > Mobile Data > Mobile Data Option > Voice & Data వెళ్లాలి. 5Gని ఎంచుకోండి.
మీరు settingను ప్రారంభించిన తర్వాత.. మీ iPhoneలో 5Gని ఉపయోగించవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone Secret Button : ప్రతి ఐఫోన్‌లోనూ ఒక సీక్రెట్ బటన్ ఉందని తెలుసా? ఆ బటన్ ఎక్కడ? ఎలా పనిచేస్తుందంటే?