Tamannaah: బౌన్సర్ జాబ్ చేస్తోన్న తమన్నా.. భలే ఉందని అంటోన్న ఫ్యాన్స్!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల ‘F3’ సినిమాతో ప్రేక్షకులను అలరించగా, తాజాగా ఆమె తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఉన్నట్లుండి ఆమె లేడీ బౌన్సర్‌గా జాబ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఈ మ్యాటర్ ఏమిటో చూద్దామా.

Tamannaah: బౌన్సర్ జాబ్ చేస్తోన్న తమన్నా.. భలే ఉందని అంటోన్న ఫ్యాన్స్!

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల ఎఫ్3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన యాక్టింగ్‌తో పాటు అందాలతో అందరినీ అలరించింది. ఇక ఈ సినిమా తరువాత తమన్నా నటుడు సత్యదేవ్ సరసన ‘గుర్తుందా శీతాకాలం’, మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలని తమన్నా ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది.

Tamannaah : తమన్నా ఆస్తుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

‘బబ్లీ బౌన్సర్’ అనే వెబ్ మూవీతో తమన్నా తన అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో తమన్నా ఓ లేడీ బౌన్సర్ జాబ్ చేస్తూ కనిపిస్తుంది. అయితే ఈ వెబ్ మూవీని హిందీలో తెరకెక్కిస్తుండగా, తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ రెడీ అవుతోంది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Tamannaah : నార్త్ ఫ్యాన్స్ కంటే సౌత్ ఫ్యాన్స్ గొప్ప అంటున్న మిల్కీ బ్యూటీ..

కాగా, తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో లేడీ బౌన్సర్‌గా బ్లాక్ డ్రెస్‌లో తమన్నా లుక్ అదిరిపోయేలా ఉండటంతో ఆమె అభిమానులు ఈ సినిమాపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 23న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఈ సినిమాతో తమన్నా ఎలాంటి హిట్ అందుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.