Tamarind Tree : చింతచిగురుతో..ఆరోగ్య ప్రయోజనాలు

చింతచిగురులో ఉండే డైటరీ ఫైబర్ సహజ సిద్ధమైన లాక్సేటివ్ గా పనిచేస్తుంది. జీర్ణసంబంధమైన సమస్యలను దూరం చేయటంతోపాటు, కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

Tamarind Tree : చింతచిగురుతో..ఆరోగ్య ప్రయోజనాలు

Chintha (1)

Tamarind Tree : చింత చిగురే కదా అని అంత తేలికగా తీసిపారేయకండి.. మనిషి శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను ఇది కలిగి ఉంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టార్టారిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ వంటివి రోగ నిరోధక వ్యవస్ధను పటిష్టం చేస్తాయి. ఎముకల ధృడంగా ఉండేందుకు చింత చిగురును ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

చింతచిగురులో ఉండే డైటరీ ఫైబర్ సహజ సిద్ధమైన లాక్సేటివ్ గా పనిచేస్తుంది. జీర్ణసంబంధమైన సమస్యలను దూరం చేయటంతోపాటు, కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. థైరాయిడ్ తో బాధపడేవారికి చింత చిగురు సంజీవనిగా పనిచేస్తుంది.

గొంతు నొప్పి, చిగుళ్ళ వాపు, నోటి పగుళ్ళు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఆహారంలో చింతచిగురు తింటే మంచి ఫలితం ఉంటుంది. నేత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. చింత చిగురు గ్రామాల్లో విరివిగా లభిస్తుంది. మార్కెట్లలో చింతచిగురు అమ్మకాలు జరుగుతున్నాయి. వేసవి ముగిసి తొలకరి ప్రారంభమయ్యే తరుణంలో చింత చిగురు విరివిగా లభిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో చింతచిగురును ఉపయోగిస్తే ఎంతో మేలు చేకూరుతుంది.