Regina Cassandra: ఛత్రపతి హిందీ రీమేక్.. సాయికి జోడీగా రెజీనా!

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా పేరున్న బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ను గ్రాండ్ గా బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఛత్రపతిని ఇందుకోసం ఎంచుకున్నారు.

10TV Telugu News

Regina Cassandra: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా పేరున్న బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ను గ్రాండ్ గా బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఛత్రపతిని ఇందుకోసం ఎంచుకున్నారు. సాయి శ్రీనివాస్ ను టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేసిన వివి వినాయక్.. బాలీవుడ్ లో కూడా తెరంగేట్రం చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను రాజమౌళి చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ చేశారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు హైదరాబాద్ పరిసరాల్లోనే సెట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రెజీనా కాసండ్రని ఎంపిక చేసినట్టు సమాచారం. తెలుగులో శ్రియా సరన్ హీరోయిన్ గా నటించిన ఈ పాత్రకి రెజీనా అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమా కోసం కియారా అద్వానీని పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ చివరికి రెజీనాకు ఆ అవకాశం దక్కినట్లు తెలుస్తుంది.

కాగా, కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెజీనా ఈ మధ్య తెలుగు సినిమాల్లో అంతగా ఆఫర్లు లేక తమిళ సినిమాల్లో నటిస్తుంది. అయితే, సోన‌మ్ క‌పూర్ తో ఏక్ ల‌డ్‌కీ కో దేఖా తో ఐసా ల‌గా సినిమాతో రెజీనా ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా రెజీనాకు ఛత్రపతి రీమేక్ రెండో సినిమా కానుంది. కాగా, రెజీనా చేతిలో దాదాపు 7 తమిళ చిత్రాలు ఉండగా.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో కూడా అతిధి పాత్రలో నటిస్తుంది.

10TV Telugu News