ఆన్‌లైన్‌ పెళ్లి విందు అదరహో.. అతిథులకు నోరూరించే వంటకాలు ఆర్డర్!

  • Published By: sreehari ,Published On : December 12, 2020 / 09:16 PM IST
ఆన్‌లైన్‌ పెళ్లి విందు అదరహో.. అతిథులకు నోరూరించే వంటకాలు ఆర్డర్!

Food For Online Wedding Attendees : కరోనా కాలం.. అసలే పెళ్లి సీజన్.. ఆన్ లైన్ పెళ్లిళ్లతో వినూత్న పద్ధతిలో జరుపుకుంటున్నారు. ఆర్భాటాలకు పోకుండా చిన్నపాటి వేడుకలను జరుపుకుంటున్నారు. అతిథిలకు ఆన్ లైన్‌లో ఆహ్వానం పలుకుతున్నారు.

కరోనా మహమ్మారి దెబ్బకు చాలా మంది శుభకార్యాలు వాయిదా వేసుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం కోవిడ్‌ కారణంగా మంచి ముహర్తాలను వదులుకోవడం లేదు. ఆన్ లైన్ లో అతిథులు ఆశీర్వాదాలతో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహాది శుభాకార్యాలను జరుపుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ కాలంలో మెజారిటీ ప్రజలు ఆన్‌లైన్‌లో వివాహ తంతు కానిచ్చేశారు. వీడియోకాల్‌లో అతిథుల ఆశీస్సులు అందుకున్నారు. పెళ్లి భోజనం ఎలా? అంటే.. ఇదిగో ఇలా పెట్టొచ్చు అంటోంది తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం. డిసెంబరు 10న శివప్రకాశ్‌, మహతి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమ పెళ్లి విందును ఆన్‌లైన్‌ హోం ఫుడ్‌ డెలివరీతో అతిథులను ఆకట్టుకున్నారు.

ఆహ్వాన పత్రికతో పాటు సంప్రదాయ పద్ధతిలో బుట్టభోజనం, అరిటాకులు, 18 రకాల వంటకాలను అతిథులకు పంపించారు. మ్యారేజ్‌ వెబ్‌కాస్ట్‌ వివరాలు, భోజనాన్ని ఎలా ఆర్గనైజ్‌ చేసే కార్డులను పంపించారు.

పెళ్లి భోజనాన్ని అందుకున్న అతిథులంతా ఉన్నచోటే ఉండి పెళ్లి విందును ఆరగిస్తూ హాయిగా వధువరులను ఆశీర్వదించారు. ఈ వినూత్న ఆహ్వానాన్ని అందుకున్న నెటిజన్‌ ఒకరు ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ అవుతున్నాయి.