Shimbu : నిఖిల్ కోసం తమిళ్ స్టార్ హీరో.. మళ్ళీ తెలుగు పాట కోసం వస్తున్న శింబు..

తమిళ్ హీరో శింబు ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో పాటలు పాడారు. ఇటీవలే రామ్ వారియర్ సినిమాలో కూడా బులెట్ సాంగ్ పాడి మెప్పించారు. ఈ పాట బాగా వైరల్ అయింది. తాజాగా శింబు మరో తెలుగు పాట పాడనున్నారు...........

Shimbu : నిఖిల్ కోసం తమిళ్ స్టార్ హీరో.. మళ్ళీ తెలుగు పాట కోసం వస్తున్న శింబు..

tamil hero simbu will sing a song in nikhil 18 pages movie

Shimbu :  ఒక హీరో సినిమాకి ఇంకో హీరో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడమో, ప్రమోషన్స్ కి రావడమో, లేక పాట పాడటం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇక ఒక సినీ పరిశ్రమ హీరో కోసం మరో సినీ పరిశ్రమ నుంచి కూడా వస్తారు. ఇది వాళ్ళ స్నేహం వల్ల కావొచ్చు, లేదా సినిమా మార్కెట్ కోసం కూడా కావొచ్చు.

తమిళ్ హీరో శింబు ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో పాటలు పాడారు. ఇటీవలే రామ్ వారియర్ సినిమాలో కూడా బులెట్ సాంగ్ పాడి మెప్పించారు. ఈ పాట బాగా వైరల్ అయింది. తాజాగా శింబు మరో తెలుగు పాట పాడనున్నారు.

Samantha : కేరళలో సమంత.. మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం..?

హీరో నిఖిల్ ఇటీవలే కార్తికేయ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట రిలీజయింది. త్వరలో టైం ఇవ్వు పిల్లా.. అంటూ మరో పాట రానుంది. ఈ పాటని తమిళ్ హీరో శింబు పాడనున్నట్టు చిత్రయూనిట్ తెలిపారు. ఈ పాటకి గోపిసుందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ పాటతో మరోసారి తెలుగు ప్రేక్షకులని మెప్పించడానికి రెడీ అయ్యాడు శింబు.