‘అమ్మ’ఆశీస్సులతో.. పిక్నిక్ కు వెళ్లిన ఏనుగులు : కరోనా పరీక్షలు చేయించుకుని మరీ..నదీతీరంలో ఎంజాయ్ చేస్తున్న గజరాజులు

‘అమ్మ’ఆశీస్సులతో.. పిక్నిక్ కు వెళ్లిన ఏనుగులు : కరోనా పరీక్షలు చేయించుకుని మరీ..నదీతీరంలో ఎంజాయ్ చేస్తున్న గజరాజులు

Tamil nadu elephants picnic : గజరాజులు..రాజసం ఉట్టి పడే ఏనుగుల్ని చూస్తే ఎంత ఆనందమో..అటువంటి గజరాజులు చక్కగా పిక్నిక్ కు వెళ్లాయి. నదీ తీరంలో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే పిక్నిక్ కు వెళ్లిన ఏనుగులన్నీ కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నాయి. ఇంతకీ ఏనుగులేంటీ. పిక్నిక్ ఏంటీ. కరోనా పరీక్షలు చేయించుకోవటమేంటీ అనే డౌట్ వచ్చే ఉంటుంది కదూ..మరి ఆ గజరాజుల పిక్నిక్ కథేంటో చూద్దాం..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు గజరాజులు చాలా ఇష్టం. ఆమె ప్రముఖ ఆలయాలకు వెళ్లినప్పుడు ఆ దేవాలయానికి ఓ ఏనుగును బహుమతిగా ఇచ్చేవారు. వాటి సంరక్షణకు భారీగా విరాళాలు కూడా ఇచ్చేవారు జయలలిత. మనుషులకు వలెనే వన్య ప్రాణులకూ మానసికోల్లాసం చాలా అవసరమని జయలలిత చెబుతుండేవారు. తమిళనాడులో ఆమె అధికారంలోకి వచ్చినప్పుడల్లా గజరాజుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేయించి, ఆ కేంద్రాల్లో ఏనుగులు సేద తీరే దిశగా చర్యలు తీసుకునేవారంటే ఆమెకు ఏనుగులంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

జయలలిత మరణం తర్వాత కూడా అన్నాడీఎంకే ప్రభుత్వం ఏనుగుల కోసం పునరావస శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. అమ్మమీద ఉండే అభిమానంతో ఆమెకు ఇష్టమైన గజరాజుల కోసం పలు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. దీంట్లో భాగంగా..రాష్ట్రంలోని ఆలయాలు, మఠాలకు చెందిన 28 ఏనుగులకు కరోనా పరీక్షలు చేయించి మరీ భవానీనదీ తీరంలోని పిక్నిక్‌ స్పాట్ కు తీసుకెళ్లారు.

తేక్కంపట్టి భవానీ నది తీరంలో ఏనుగులు ఉల్లాసంగా గడిపే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వాటికి  కావాల్సి ఆహారం..నీరు..అవి స్వేచ్చగా తిరగటానికి చర్యలు అన్నీ ఏర్పాటు చేశారు. సోమవారం (జనవరి8,2021) ఉదయం 4.30 గంటలకు పునరావాస కేంద్రంలో ప్రత్యేక యాగాది పూజలు జరిగాయి.

అనంతరం వినాయకుడి ఆలయంలో జరిగిన పూజలతో గజరాజులు శిబిరంలోకి ప్రవేశించాయి. వినాయకుడు ఏనుగు తలతో ఉంటాడు కాబట్టి గజాననుడు అని కూడా అంటారు. అలా వినాయకుడిలో భాగమైన ఏనుగులను వినాయికుడి దేవాలయంలో పూజలు తరువా పునరావాస శిబిరాలను తరలించారు.

అలా భవానీ నదీ తీరానాకి వచ్చిన ఏనుగులను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు అటవీశాఖమంత్రి దిండుగల్‌ శ్రీనివాసన్‌ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో శిబిరం ప్రారంభమైంది. ఇలా పిక్నిక్ కు వచ్చిన గజరాజులు నెలన్నర పాటు అంటే 48 రోజులు ఇక్కడ సేదతీరనున్నాయి.