Crime news: ప్రేమించలేదని బాలికను 14సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే నెపంతో ఇంటర్ చదువుతున్న బాలికపై యువకుడు కత్తితో దాడిచేశాడు. 14సార్లు కత్తితో పొడిచాడు. బాలిక ప్రాణాప్రాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక ఇంటర్ చదువుతుంది.

Crime news: ప్రేమించలేదని బాలికను 14సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది

Crime News (1)

Crime news: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే నెపంతో ఇంటర్ చదువుతున్న బాలికపై యువకుడు కత్తితో దాడిచేశాడు. 14సార్లు కత్తితో పొడిచాడు. బాలిక ప్రాణాప్రాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక ఇంటర్ చదువుతుంది. పరీక్షలు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అప్పటికే కాపుకాసుకొని ఉన్న కేశవన్‌ అనే యువకుడు బాలికపై కత్తితో దాడిచేశాడు. గత ఏడాది బాలికను ప్రేమ పేరుతో వేధించడంతోపాటు.. జూన్ నెలలో బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించడంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేశవన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Crime news: పోలీసుల అత్యుత్సాహం.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

కొద్దిరోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన కేశవన్.. బాలికపై కోపం పెంచుకున్నాడు. తనను ప్రేమించమటే ఎందుకు ప్రేమించడం లేదంటూ మళ్లీ వేధించడం మొదలు పెట్టారు. బెదిరింపులకు గురిచేశాడు. బాలిక ప్రేమకు నిరాకరించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. ఎంతకీ బాలిక తన ప్రేమను ఒప్పుకోవటం లేదన్న ఆగ్రహంతో కత్తితో దాడి చేశాడు. 14సార్లు కత్తితో పొడవడంతో బాలిక అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. రక్తపు ముడుగులో ఉన్న బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలికకు చికిత్స అందజేస్తున్నారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉంది. బాలికపై దాడిచేసిన కేశవన్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Crime news: పెళ్లి చేసుకోనన్న ప్రియురాలు.. లేఖరాసి ప్రియుడు ఆత్మహత్య.. ఆ లేఖలో ఏముందంటే..

ఈ ఘటనపై కరూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ జోతిమణి ట్వీట్‌ చేస్తూ.. ఓ పాఠశాల విద్యార్థిని 14 సార్లు కత్తిపోట్లకు గురైందని విని షాక్‌కు గురయ్యానన్నారు. కేశవన్‌ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. అలాంటి దురాగతాలు జరిగిన ప్రతిసారీ మేము కలత చెందుతున్నామని అన్నారు. కఠోరమైన శిక్షలతో పాటు సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే విద్య ద్వారా సాధ్యమవుతుందని జోతిమణి ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే బాలికను కత్తితో పొడిచిన తరువాత కేశవన్‌గా మణప్పెరై సమీపంలోని రైలు కింద పడి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైలుపట్టాలపై ఓ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేశవన్‌గా భావిస్తున్నారు. మృతదేహం నుంచి ఫోన్ ను స్వాధీనంచేసుకొని కేశవ్ తండ్రికి సమాచారం ఇచ్చారు. అయితే ఆ మృతదేహం కేశవన్‌దా లేక వేరేవారిదా అన్న విషయం తేలాల్సి ఉంది.