Tamil Nadu: పదేళ్లుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. టీచర్‌పై కేసు నమోదు

తన స్కూళ్లో చదివే దివ్యాంగులైన బాలికలపై పదేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో టీచర్. తాజాగా అతడి మీద బాలికలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీచర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tamil Nadu: పదేళ్లుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. టీచర్‌పై కేసు నమోదు

Tamil Nadu

Tamil Nadu: పదేళ్లుగా దివ్యాంగులైన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో టీచర్. దీంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు తమిళనాడు పోలీసులు. శివగంగ జిల్లా పరిధిలోని మనమదురై ప్రాంతంలో ఉన్న సీఎస్ఐ అనే ఉన్నత పాఠశాలలో వినికిడి సమస్య ఉన్న దివ్యాంగులైన బాలికలకు విద్య అందిస్తారు.

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తున్న రిషి సునక్.. నాలుగో రౌండ్లో ముందంజ

చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన దాదాపు 80 మంది బాలికలు ఇక్కడ చదువుకుంటారు. ఈ పాఠశాలలో ఆల్బర్ట్ అబ్రహం అనే వ్యక్తి చాలా ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలలో చదివే బాలికలపై ఆల్బర్ట్ పదేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ అంశంపై బాలికలు, పలు సంస్థలతో కలిసి ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు బాలికలు.. దివ్యాంగులకు సంబంధించిన సంస్థలతో కలిసి ఈ నెల 14న ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టరేట్‌తోపాటు, దివ్యాంగుల జిల్లా కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు. అయితే, అధికారులు నిందితుడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో సోమవారం మళ్లీ నిరసన చేపట్టారు. దాదాపు 50 మందికిపైగా విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. తప్పు చేసిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

దీంతో డీఎస్పీ కన్నన్ వారితో చర్చలు జరిపారు. తహసీల్దార్ శాంతితోపాటు ఇతర అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. ఈ విచారణలో ఆల్బర్ట్ అనే ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లుగా నిర్ధరణకు వచ్చారు. దాదాపు పదేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆల్బర్ట్ అబ్రహంపై పోలీసులు పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.