Tamilisai Soundararajan: రాజ్ భవన్ చేరుకున్న గవర్నర్

కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ పరిసరాల్ని ముట్టడిస్తున్నాయి. దశలవారీగా ముట్టడి కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో ఖైరతాబాద్, నాంపల్లి చుట్టు పక్కల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. అధికారులు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు.

Tamilisai Soundararajan: రాజ్ భవన్ చేరుకున్న గవర్నర్

Tamilisai Soundararajan

Tamilisai Soundararajan: కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో గవర్నర్ కార్యాలయమైన రాజ్ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, రాజ్ భవన్ చేరుకునే విషయంలో ఆందోళన నెలకొంది. అయితే, తమిళి సై సౌందర రాజన్ ఎలాంటి ఇబ్బందీ లేకుండా రాజ్ భవన్ చేరుకున్నారు. దీంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ పరిసరాల్ని ముట్టడిస్తున్నాయి. దశలవారీగా ముట్టడి కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో ఖైరతాబాద్, నాంపల్లి చుట్టు పక్కల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. అధికారులు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

కాంగ్రెస్ శ్రేణులు చొచ్చుకు రాకుండా, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇంకా ఆ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. కాంగ్రెస్ నిరసన ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలు వాహనాలను ధ్వంసం చేశారు. సిటీ బస్సు పైకెక్కి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.