Tamilnadu: ఓ వైపు వర్షాలు.. మరోవైపు భూకంపం…అల్లాడిపోతున్న తమిళనాడు ప్రజలు.

తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు భూ ప్రకంపనలతో ప్రజలు హడలిపోతున్నారు.

Tamilnadu: ఓ వైపు వర్షాలు.. మరోవైపు భూకంపం…అల్లాడిపోతున్న తమిళనాడు ప్రజలు.

Tamilanadu

tamilnadu earthquake hits vellore : తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం భూప్రకంపనల భయంతో బయటకు పరుగులు తీశారు. కానీ ఈ ప్రమాదం వల్ల ఎటువంటి..ఆస్తి, ప్రాణనష్టాలు జరుగలేదు.దీంతో అధికారులు, ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వీటితోనే.. ఆ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో.. వారిని భూకంపం రూపాన మరో ప్రమాదం ముంచుకొచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో సోమవారం (నవంబర్ 29,2021) భూకంపం సంభవించింది.

Read more : Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు, IMD ‘రెడ్’ అలర్ట్.. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం
తమిళనాడులోని వెల్లూరులో పలుచోట్ల భూమి బీటలు వారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.6గా తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని వెల్లడించారు. భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ అధికారులు తెలిపారు.

Read more : NFHS : 70 % మహిళలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు: NFHS సర్వే

అసలే ఓ వైపు భారీ వర్షాలతో తమిళనాడు ప్రజలు అతలాకుతలం అవుతుంటే… ఇప్పుడు భూప్రకంపనలతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. వెల్లూరులో ఇటీవల భారీ వర్షాలు కురిసిన కారణంగా ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చెక్‌డ్యామ్‌లు, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి వరదనీరు పోటెత్తడంతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. ఎటు దిక్కుతోచని దుస్థితిలో జనాలు అల్లాడిపోతున్నారు. వరుస తుఫాన్లతో తమిళనాడు వణికిపోతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు ఉప్పొంగుతోంది. పాలార్ నదికి వరద ఉధృతి కారణంగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా ఒకవైపు వర్షాలు.. మరోవైపు భూకంపంతో ప్రజలు వణికిపోతున్నారు.