Tamilsai soundararajan: అందుకే ఆ నలుగురు మహిళలు మృతి చెందినట్లు నేను భావిస్తున్నాను: గవర్నర్ తమిళిసై

తక్కువ సమయంలో ఎక్కువ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం, ఇన్ఫెక్షన్‌ వల్లే.. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రంలో ఆ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళల్లో నలుగురు మృతి చెందినట్లు తాను భావిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. ఓ వైద్యురాలిగా తాను ఈ అభిప్రాయం చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే.

Tamilsai soundararajan: అందుకే ఆ నలుగురు మహిళలు మృతి చెందినట్లు నేను భావిస్తున్నాను: గవర్నర్ తమిళిసై

Tamilsai soundararajan: తక్కువ సమయంలో ఎక్కువ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం, ఇన్ఫెక్షన్‌ వల్లే.. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రంలో ఆ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళల్లో నలుగురు మృతి చెందినట్లు తాను భావిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. ఓ వైద్యురాలిగా తాను ఈ అభిప్రాయం చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని వికటించిన వారిలో కొందరు మహిళలు హైదరాబాద్ లోని నిమ్స్, జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిమ్స్‌లో బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో తమిళిసై మాట్లాడారు. కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించుకోవడానికి మరింత మంది ముందుకు వచ్చేలా చేయాలని చెప్పారు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచాలని అన్నారు.

ఇటీవల శస్త్రచికిత్సలు వికటించి నలుగురు మహిళలు చనిపోవడం సాధారణ విషయం కాదని చెప్పారు. దానిపై విచారణ జరుగుతోందని.. నివేదిక వచ్చాక పూర్తి కారణాలు తెలుస్తాయని చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించే ఘటనలు పునరావృతం కావద్దని అన్నారు. చాలా మందికి తక్కువ సమయంలో ఆపరేషన్లు చేయాలన్న లక్ష్యాలు పెట్టుకోవద్దని చెప్పారు. నిమ్స్‌లో జరిగే చికిత్సలపై బాధితులు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. వారు ఆర్థిక సాయం కోరుతున్నారని తెలిపారు. వారి విజ్ఞప్తిని తాను సర్కారు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన