Jr NTR: చెర్రీ ఇంటి ముందు తారక్ లంబోర్గిని.. అసలు నిజం ఇదే!

ఇండియన్ సినీ హీరోలకు ఇప్పుడు ఇటలీ లంబోర్గిని మీద అమితమైన ప్రేమ. అందుకే బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు చాలామంది స్టార్స్ ఈ కారును సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ మధ్యనే తెలుగులో కూడా ప్రభాస్ ఈ కారును సొంతం చేసుకోగా..

10TV Telugu News

Jr NTR: ఇండియన్ సినీ హీరోలకు ఇప్పుడు ఇటలీ లంబోర్గిని మీద అమితమైన ప్రేమ. అందుకే బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు చాలామంది స్టార్స్ ఈ కారును సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ మధ్యనే తెలుగులో కూడా ప్రభాస్ ఈ కారును సొంతం చేసుకోగా.. ఇటు హైదరాబాద్ నుండి అటు ముంబై వీధుల మీద దీంతో చక్కర్లు కొడుతున్నాడు. కాగా, ఇప్పుడు మన టాలీవుడ్ లో మరో లంబోర్గిని కారు దిగుమతి అయిందని ప్రచారం జరుగుతుంది.

మన తెలుగు హీరోలలో కార్లు, బైకులపై అమితమైన ఆసక్తి కలిగిన హీరో జూనియర్ ఎన్టీఆర్. స్వతహాగా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు కూడా డ్రైవింగ్ చాలా ఇష్టం కాగా ఎన్టీఆర్ కు కూడా వైవిధ్యమైన వాహనాలు కలెక్ట్ చేసి వాటిలో చక్కర్లు కొట్టడం అంటే మహా సరదా. అందుకే ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజీలో పలురకాల కాస్ట్ లీ కార్లు ఉండగా.. ఇప్పుడు లంబోర్గిని కూడా వచ్చి చేరిందని సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది.

ఈ మధ్యనే ఇటలీ నుండి లంబోర్గిని కారును దిగుమతి చేసుకున్న ఎన్టీఆర్ ఫస్ట్ రైడ్ రామ్ చరణ్ ఇంటికే వెళ్లాడని.. చరణ్ ఇంటి ముందున్న లంబోర్గిని కారుతో పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే.. ఎన్టీఆర్ లంబోర్గిని కారును బుక్ చేసిన మాట వాస్తవమే కానీ.. అది ఇంకా ఇండియాకు దిగుమతి కాలేదని.. రామ్ చరణ్ ఇంటి ముందున్న కారు ఎన్టీఆర్ ది కాదని ఆయన మేనేజర్ తెలిపాడు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం చరణ్ ఇంటి ముందున్న తారక్ కారు అంటూ ప్రచారం హోరెత్తిపోతుంది.

10TV Telugu News