Five lions escape: బోను నుంచి బయటకు వచ్చి కలకలం రేపిన 5 సింహాలు

 ఓ జంతు ప్రదర్శనశాలలోని బోను నుంచి 5 సింహాలు బయటకు వచ్చాయి. దీంతో ఆ జూలో కొంత సమయం పాటు భయాందోళనలు నెలకొన్నాయి. జూలో ఎవరినీ ఉండనివ్వకుండా అధికారులు అక్కడి ప్రాంతంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఆ ఐదు సింహాల్లో ఒకటి తల్లి సింహం అని, మిగతావి దాని పిల్లలని అధికారులు చెప్పారు. చివరకు వాటన్నింటినీ పట్టుకుని మళ్ళీ బోనులో వేశామని వివరించారు. ఈ ఘటన ఆస్ట్రేలియా, సిడ్నీలోని తరోంగా జంతు ప్రదర్శనశాలలో చోటుచేసుకుంది.

Five lions escape: బోను నుంచి బయటకు వచ్చి కలకలం రేపిన 5 సింహాలు

Five lions escape: ఓ జంతు ప్రదర్శనశాలలోని బోను నుంచి 5 సింహాలు బయటకు వచ్చాయి. దీంతో ఆ జూలో కొంత సమయం పాటు భయాందోళనలు నెలకొన్నాయి. జూలో ఎవరినీ ఉండనివ్వకుండా అధికారులు అక్కడి ప్రాంతంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఆ ఐదు సింహాల్లో ఒకటి తల్లి సింహం అని, మిగతావి దాని పిల్లలని అధికారులు చెప్పారు. చివరకు వాటన్నింటినీ పట్టుకుని మళ్ళీ బోనులో వేశామని వివరించారు.

ఈ ఘటన ఆస్ట్రేలియా, సిడ్నీలోని తరోంగా జంతు ప్రదర్శనశాలలో చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం సమయంలో మొదట ఆ 5 సింహాలు బోను బయట కనపడడంతో అధికారులు వెంటనే అప్రమత్తమమై తగిన చర్యలు తీసుకున్నారు. వెంటనే జూ కీపర్ అలారం మోగించారు. అనంతరం అక్కడ ఉన్న వారందరినీ బయటకు పంపించారు. కొద్దిసేపటికి ఓ సింహం పిల్లకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు.

మిగతా నాలుగు సింహాలు మాత్రం వాటంతట అవే తిరిగా బోనులోకి వెళ్లిపోయాయి. ఆ సింహాలు ఎవరిమీదా దాడి చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోనులో నుంచి ఆ సింహాలు ఎలా బయటకు వచ్చాయన్న విషయంపై వివరాలు తెలియరాలేదు. అయితే, సింహాలు బయటకు రావడం సాధారణ విషయం కాదని అధికారులు అన్నారు.

ఆ సింహాలు బోను ఉండే ప్రాంతం నుంచి దూరంగా వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది. సిడ్నీలోని జూ నుంచి సింహం బయటకు వచ్చిన ఘటన గతంలోనూ చోటుచేసుకుంది. 2009లో బోను నుంచి బయటకు వచ్చిన ఆ సింహాన్ని అధికారులు కాల్చి చంపేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..