Tata Technologies: 18 ఏళ్ల తర్వాత టాటా టెక్నాలజీస్ ఐపీఓ

టాటా గ్రూప్ నుంచి 2004లో టీసీఎస్ మాత్రమే పబ్లిక్ ఇష్యూకురాగా, ఆ తర్వాత ఐపీఓకు వస్తున్న సంస్థ ఇదే. త్వరలోనే ఐపీఓ ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు గత వారమే ఒక నివేదిక వెల్లడించింది. ఐపీఓ వ్యవహారాలు చూసేందుకు సిటీ గ్రూప్ సంస్థను టాటా నియమించుకున్నట్లు సమాచారం.

Tata Technologies: 18 ఏళ్ల తర్వాత టాటా టెక్నాలజీస్ ఐపీఓ

Tata Technologies

Tata Technologies: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన టాటా టెక్నాలజీస్ త్వరలో పబ్లిక్ ఇష్యూకు రాబోతుంది. ఈ సంస్థ 18 ఏళ్ల తర్వాత ఐపీఓకు వస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన ప్రక్రియను సంస్థ ప్రారంభించింది. టాటా గ్రూప్ నుంచి 2004లో టీసీఎస్ మాత్రమే పబ్లిక్ ఇష్యూకురాగా, ఆ తర్వాత ఐపీఓకు వస్తున్న సంస్థ ఇదే. త్వరలోనే ఐపీఓ ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు గత వారమే ఒక నివేదిక వెల్లడించింది. ఐపీఓ వ్యవహారాలు చూసేందుకు సిటీ గ్రూప్ సంస్థను టాటా నియమించుకున్నట్లు సమాచారం.

Electric Highway: ఢిల్లీ నుంచి ముంబైకు ఎలక్ట్రిక్ హైవే నిర్మాణం

దీంతోపాటు టాటా గ్రూప్ మరో అనుబంధ సంస్థ అయిన టాటా స్కై కూడా ఐపీఓకు వచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే, టాటా ఐపీఓకు సంబంధించి వస్తున్న వార్తలపై స్పందించేందుకు టాటా గ్రూప్ నిరాకరించింది. ఈ ఐపీఓకు మంచి స్పందన వస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.