TATA Avinya: సరికొత్త ఎలక్ట్రిక్ కారు “అవిన్యా”ను ఆవిష్కరించిన టాటా సంస్థ: టెస్లా ఇండియాలోకి రాకపోవడమే బెటర్

TATA Avinya విద్యుత్ వాహనాన్ని శుక్రవారం టాటా సంస్థ ఆవిష్కరించింది. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా డిజైన్ చేసిన ఈ అవిన్యా కారు సాధారణ వాహనాల కంటే పూర్తి బిన్నంగా ఉండనుంది

TATA Avinya: సరికొత్త ఎలక్ట్రిక్ కారు “అవిన్యా”ను ఆవిష్కరించిన టాటా సంస్థ: టెస్లా ఇండియాలోకి రాకపోవడమే బెటర్

Avinya

TATA Avinya: దేశీయ దిగ్గజ వాహన సంస్థ టాటా మోటార్స్ విద్యుత్ వాహనాల విభాగంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఉన్న పెట్రోల్ పోర్టుఫోలియో(పెట్రోల్ ఆధారిత కార్లు)నే..విద్యుత్ వాహనాల్లోనూ కొనసాగిస్తున్న టాటా..ఇకపై పూర్తి విద్యుత్ వాహన శ్రేణిపై దృష్టిపెట్టింది. తమ ‘Pure EV Gen 3’ ప్లాట్ ఫార్మ్ పై సరికొత్త విద్యుత్ వాహనాలను అభివృద్ధి చేస్తున్న టాటా మోటార్స్..డిజైన్ పరంగానూ, సాంకేతికత పరంగానూ, అనుభూతి పరంగానూ సాధారణ వాహనాల కంటే మరింత అధునాతనంగా ఉండేలా కార్లను అభివృద్ధి చేసింది. ఈ ‘zen 3’ ప్లాట్ ఫార్మ్ పై ఇప్పటికే curvv అనే కారును తెస్తున్నట్లు ప్రకటించిన టాటా మోటార్స్ తాజాగా..”Avinya” అనే మరో అధునాతన విద్యుత్ వాహనాన్ని ఆవిష్కరించింది.

Also read:WWE Veer Mahan: WWEలో సత్తా చాటుతున్న భారత వీరుడు: ఈ వీర్ మహాన్ ఎవరు?

TATA Avinya విద్యుత్ వాహనాన్ని శుక్రవారం టాటా సంస్థ ఆవిష్కరించింది. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా డిజైన్ చేసిన ఈ అవిన్యా కారు సాధారణ వాహనాల కంటే పూర్తి బిన్నంగా ఉండనుంది. 2025 నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి కానున్న ఈ కొత్త విద్యుత్ శ్రేణి నుంచి టాటా మోటార్స్ లోగో సైతం మార్చనున్నట్లు సమాచారం. విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సరికొత్త లోగోతో ఈ కొత్త వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి. అవిన్యా విషయానికొస్తే..SUV, MPV కలబోతగా..ప్రీమియం కార్లైనా ఆడి, BMW, Tesla కార్లకు ధీటుగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 4300mm పొడవుతో..సువిశాలమైన క్యాబిన్, లగ్జరీ సీట్లు, ఎక్కిదిగడానికి వీలుగా తెరుచుకునే డోర్లు..ముందు భాగంలో డిజైనర్ LED లైట్లు..ఇలా ఎన్నో ప్రత్యేకతలు అవిన్యా విద్యుత్ కారులో ఉన్నాయి.

Also read:Book Train Tickets : ట్రైన్ జనరల్‌ టికెట్ల కోసం ఇక క్యూలైన్ అక్కర్లేదు.. ఇలా బుకింగ్ చేస్తే సరి..!

వీటితో పాటుగా సాధారణ కారుల్లో ఊహకు కూడా అందని మారినో అధునాతన సాంకేతిక ప్రత్యేకతలు ఈ అవినీతిలో ఉండనున్నాయి. ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కనీసం 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ప్రస్తుతం కాన్సెప్ట్ దశలోనే ఉన్న ఈ అవిన్యా విద్యుత్ కారును 2025 నాటికీ వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు టాటా మోటార్స్ విద్యుత్ వాహన విభాగం ప్రతినిధి వివరించారు. కాన్సెప్ట్ కారును యధాతధంగా తీసుకురావడంలో టాటా మోటార్స్ ఇప్పటికే మార్కెట్లో నిరూపించుకుంది. అన్నట్టు అవిన్యా అనేది సంస్కృత పదం. ‘నూతనత్వం’ అనేది దీని అర్ధం.

Also read:Solar Eclipse : 2022లో తొలి సూర్యగ్రహణం రేపే.. ఇండియాలో చూడొచ్చా..?