Updated On - 5:40 pm, Sat, 27 February 21
tdp activists fire on mp kesineni nani: విజయవాడ టీడీపీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం ముట్టడికి కార్యకర్తలు ప్రయత్నించారు. మున్సిపల్ ఎన్నికలు టీడీపీలో చిచ్చు రాజేశాయి. 34వ డివిజన్ నుంచి టికెట్ ఆశించిన గొట్టేటి హనుమంతురావు తన అనుచరులతో కలిసి కేశినేని కార్యాలయానికి వచ్చారు.
హనుమంతరావు కూతురుతో పాటు కార్యకర్తలు కార్యాలయం ముందు బైఠాయించారు. టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 34వ డివిజన్ టికెట్ తమకే ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని టీడీపీ కార్యకర్తలు తేల్చి చెప్పారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ టికెట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారింది. సొంత పార్టీ కార్యకర్తలే ఎంపీ నానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం విజయవాడలో కలకలం రేపుతోంది. 34వ డివిజన్ అభ్యర్థి మార్పుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కేశినేని కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.
బయోటెక్నాలజీ-రూ.37వేల 400, కెమిస్ట్రీ-రూ.33వేలు.. పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు
Tirupati by election: కాసేపట్లో ముగుస్తున్న ప్రచారం.. తిరుపతిలో ఎవరి లెక్క ఏంటీ?
Bobbili Veena : బొబ్బిలి వీణకు…కరోనా కాటు..
CBI JD Lakshmi Narayana : పొలంబాట పట్టిన మాజీ సిబిఐ జేడి….కౌలురైతుగా సేద్యంలోకి…
Suckker Fish : తినటానికి పనికిరాదు కానీ…పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది… వింత చేపతో తంట…
Tenth, Inter Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం