Student Tilak: బొట్టు పెట్టుకుని వచ్చిన స్డూడెంట్‌ను దండించిన టీచర్

జమ్మూ అండ్ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని ఓ హిందూ కుటుంబానికి చెందిన బాలికను స్కూల్ టీచర్ దారుణంగా దండించారు. నుదుటిపై తిలకం (బొట్టు) పెట్టుకుని వచ్చినందుకే అటువంటి చర్యలు..

Student Tilak: బొట్టు పెట్టుకుని వచ్చిన స్డూడెంట్‌ను దండించిన టీచర్

Student Tilak

Student Tilak: జమ్మూ అండ్ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని ఓ హిందూ కుటుంబానికి చెందిన బాలికను స్కూల్ టీచర్ దారుణంగా దండించారు. నుదుటిపై తిలకం (బొట్టు) పెట్టుకుని వచ్చినందుకే అటువంటి చర్యలు తీసుకున్నట్లు తెలియడంతో నిసార్ అహ్మద్ అనే టీచర్ ను డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఖదూరియన్ పంచాయత్ కు చెందిన ఇద్దరు బాలికలను దండించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు నిజమని తెలియడంతో ఐపీసీ సెక్షన్స్ 323, 325, 352, 506 ప్రకారం కేసులు నమోదు చేశారు.

రాజౌరీ సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మొహమ్మద్ అస్లాం చౌదరీ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మైనర్ బాలికను శిక్షించినట్లుగా కంప్లైంట్ వచ్చింది. దాంతో పాటు ఆమెను అభ్యంతరకర వ్యాఖ్యలతో దూషించినట్లుగా తెలిసింది. నిందితుడైన టీచర్ పై కేసు నమోదు చేశాం. విచారణ జరుపుతున్నాం’ అని వెల్లడించారు.

Read Also: పరీక్ష రాసేందుకు స్టూడెంట్‌ను హిజాబ్‌తో అనుమతించిన టీచర్ సస్పెండ్