Covid-19: కరోనాకు భయపడి టీచర్ ఆత్మహత్య

కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను ఛిద్రం చేస్తుంది. దీని బారినపడి దేశ వ్యాప్తంగా రెండు లక్షల 30 వేలమంది మృతి చెందారు. కరోనా భయంతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఓ టీచర్ కరోనా సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

Covid-19: కరోనాకు భయపడి టీచర్ ఆత్మహత్య

Covid 19

Covid-19: కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను ఛిద్రం చేస్తుంది. దీని బారినపడి దేశ వ్యాప్తంగా రెండు లక్షల 30 వేలమంది మృతి చెందారు. కరోనా భయంతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఓ టీచర్ కరోనా సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా లత్తురి సమీపంలోని పాట్టియనూరు గ్రామానికి చెంది ఏలుమలై (40) మేల్‌మాయిల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో డ్రాయిగ్ టీచర్ గా పనిచేస్తున్నాడు.

గత వారం ఏలుమలైకి జలుబు దగ్గు లక్షణాలు ఉండటంతో వేలూరు అడుక్కంబరై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. బుధవారం ఆసుపత్రినుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతని కోసం ఎంత వెతికినా దొరకలేదు. అయితే ఆసుపత్రి సమీపంలోని ఓ వ్యవసాయబావిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. విచారణలో మృతుడు ఏలుమలై అని పోలీసులు నిర్దారించారు. తాను ట్రీట్మెంట్ చేయనుకున్న ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. ఏలుమలైకి కరోనా పాజిటివ్ ఉందని మూడు రోజులు ఆసుపత్రిలో ఉన్నాడని, ఆ తర్వాత కనిపించలేదని వైద్యులు తెలిపారు. వైద్యుల స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని కరోనాకు భయపడి ఏలుమలై ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించారు పోలీసులు.