పురుషాంగం కట్ చేసుకుని, వీడియో తీసిన టీచర్.. ఇదేం చాలెంజ్‌రా నాయనా?

సోషల్ మీడియా పుణ్యమా అని వింత, చెత్త చాలెంజ్ లు పుట్టుకొస్తున్నాయి. గతంలో కొన్ని చాలెంజ్ లు ప్రాణాల మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి చాలెంజ్ మరొకటి బయటపడింది. అదే, పురుషాంగాన్ని(పెనిస్ కట్) స్వయంగా కట్ చేసుకోవడం. వినడానికి షాకింగ్ గా ఉంది కదూ

పురుషాంగం కట్ చేసుకుని, వీడియో తీసిన టీచర్.. ఇదేం చాలెంజ్‌రా నాయనా?

Teacher Gets His Private Part Cut: సోషల్ మీడియా పుణ్యమా అని వింత, చెత్త చాలెంజ్ లు పుట్టుకొస్తున్నాయి. గతంలో కొన్ని చాలెంజ్ లు ప్రాణాల మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి చాలెంజ్ మరొకటి బయటపడింది. అదే, పురుషాంగాన్ని(పెనిస్ కట్) స్వయంగా కట్ చేసుకోవడం. వినడానికి షాకింగ్ గా ఉంది కదూ.

డబ్బు కోసం పిచ్చి పని:
ఇంటర్నెట్ లో ఒకతను విసిరిన పెనిస్ కట్ చాలెంజ్ ను డబ్బు కోసం బ్రిటన్ కు చెందిన ఓ టీచర్ స్వీకరించాడు. తన చేతిలోకి ఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత అందులో వీడియో రికార్డ్ ఆన్ చేశాడు. ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లి కూరగాయలు తరిగే కత్తిని(12 ఇంచులు) చేతిలోకి తీసుకుని తన పురుషాంగాన్ని కట్ చేసుకున్నాడు.

అంగాన్ని కట్ చేసుకున్నప్పుడు తీవ్రమైన నొప్పి వచ్చింది. నొప్పి తాళలేక అతగాడు గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. కేకలు విని కంగారుపడిన చుట్టుపక్కల వాళ్లు పరిగెత్తుకుని వచ్చారు. అక్కడ జరిగింది చూసి షాక్ తిన్నారు. వెంటనే ఆ టీచర్ నిఆసుపత్రికి తరలించారు. అతడితో పాటు తెగిపడిన పురుషాంగాన్ని కూడా తీసుకెళ్లారు. డాక్టర్లు అతడికి ఆపరేషన్ చేశారు. పెనిస్ ను తిరిగి అతికించారు. ఇప్పుడీ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎందుకీ పిచ్చి పని చేశావు అంటే, పురుషాంగాన్ని కట్ చేసుకుని వీడియో తీసి ఆ వీడియోని యూట్యూబ్ లో ఉంచితే, బాగా డబ్బు వస్తుందని చెప్పాడు.

బిట్ కాయిన్ కొనాలని:
పెనిస్ కట్ చాలంజ్ ని చాలా మంది యాక్సెప్ట్ చేసి ఆస్పత్రిపాలయ్యారు, అవుతున్నారు. ఇప్పుడు టీచర్ దాని బారిన పడ్డాడు. డబ్బు బాగా సంపాదించాలని టీచర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం వీడియో గేమ్స్, పబ్ జీ లాంటివి ఆడి… చాలామందితో చాలెంజ్‌లు చేసి ఓడిపోయాడు. కాగా, ప్రస్తుతం బిట్ కాయిన్ ధర బాగా పెరగడంతో మనోడి కన్ను దానిపై పడింది. ఒక్క బిట్ కాయిన్ ధర రూ.35,84,905 ఉంది. ఆ కాయిన్ కొనుక్కోవాలని అతడు కలలు కన్నాడు.

ఇదే సమయంలో ఇంటర్నెట్‌లో పెనిస్ కట్ ఛాలెంజ్ కనిపించింది. ఛాలెంజ్‌లో గెలిస్తే కొంత డబ్బు వస్తుంది. దీంతో ఆ టీచర్ చాలెంజ్ ని యాక్సెప్ట్ చేశాడు. కానీ ఆ డబ్బుతో బిట్ కాయిన్ కొనడం అసాధ్యం. దీంతో ఆ టీచర్ మరో ప్లాన్ వేశాడు. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని… మొత్తం వీడియో తీసి… యూట్యూబ్‌లో పెడితే… అది వైరల్ అయి భారీగా డబ్బు వస్తుందని అనుకున్నాడు. వాస్తవానికి ఇలాంటి వీడియోలకు యూట్యూబ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. పైగా ఇలాంటి దరిద్రమైన వీడియోలను డిలీట్ చేస్తుంది కూడా.

వీడియోని యూట్యూబ్ లో పెట్టాలనుకున్నాడు:
యూట్యూబ్ రూల్స్ గురించి అవగాహన లేని ఆ టీచర్… కిచెన్ లోకి వెళ్లి తన మొబైల్ ని గోడకు తగిలించాడు. ఆ తర్వాత వీడియో ఆన్ చేసి తను సరిగా కనిపిస్తున్నానో లేదో చూసుకున్నాడు. ఆపై వీడియో రికార్డ్ ఆన్ చేసి… కూరగాయలు కోసే కత్తితో… తన పురుషాంగాన్ని కోసేసుకున్నాడు. ఇక తనకు బిట్ కాయిన్ వచ్చేసినట్లే అనుకున్నాడు. అంతలోనే… విపరీతంగా రక్తస్రావం జరిగి, నొప్పితో విలవిలలాడు. కేకలు విన్న స్థానికులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పురుషాంగాన్ని కూడా కవర్‌లో పట్టుకెళ్లారు. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేసి పెనిస్ ని తిరిగి అతికించారు. మొత్తానికి చావు అంచుల నుంచి అతడిని కాపాడారు.

మరీ ఇంత సిల్లీగా ఆలోచన చేసిన ఆ టీచర్.. ఎర్రి పుష్పం అనుకుంటే.. తప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే, అతడు గ్రాడ్యుయేషన్ చేసింది ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో మరి… పేరు ఆండ్రూ బ్రీచ్ (Andrew Breach). ప్రస్తుతం ఆండ్రూ ఆరోగ్యం బాగానే ఉంది. డాక్టర్ల దయ వల్ల అతడి పెనిస్ కూడా సరిగ్గానే పని చేస్తోంది.