Teacher recruitment scam: ఈడీ క‌స్ట‌డీలోకి తీసుకున్న‌ కొద్దిసేప‌టికే.. ఆసుప‌త్రిలో చేరిన బెంగాల్ మంత్రి

ఉపాధ్యాయ నియామ‌క కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి కేసులో నిన్న‌ అరెస్ట‌యిన‌ ప‌శ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అనారోగ్య కార‌ణాల‌తో ఆసుప‌త్రిలో చేరారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఎస్ఎస్కేఎం ఆసుప‌త్రిలో చేరార‌ని అధికారులు తెలిపారు. ఛ‌ట‌ర్జీని నిన్న కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా ఆయ‌న‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారుల క‌స్ట‌డీకి ఇస్తూ న్యాయ‌స్థానం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

Teacher recruitment scam: ఈడీ క‌స్ట‌డీలోకి తీసుకున్న‌ కొద్దిసేప‌టికే.. ఆసుప‌త్రిలో చేరిన బెంగాల్ మంత్రి

Partha Chatterjee

Teacher recruitment scam: ఉపాధ్యాయ నియామ‌క కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి కేసులో నిన్న‌ అరెస్ట‌యిన‌ ప‌శ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అనారోగ్య కార‌ణాల‌తో ఆసుప‌త్రిలో చేరారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఎస్ఎస్కేఎం ఆసుప‌త్రిలో చేరార‌ని అధికారులు తెలిపారు. ఛ‌ట‌ర్జీని నిన్న కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా ఆయ‌న‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారుల క‌స్ట‌డీకి ఇస్తూ న్యాయ‌స్థానం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆ వెంట‌నే ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డడంతో ఆసుప‌త్రిలో చేర్పించారు.

corona: దేశంలో 1,50,100కు చేరిన క‌రోనా యాక్టివ్ కేసులు

మొద‌ట‌ ఆసుప‌త్రిలోని ఐసీసీయూలో ఆయ‌న‌కు చికిత్స అందింది. ఆరోగ్యం కాస్త మెరుగుప‌డ‌డంతో జ‌న‌ర‌ల్ వార్డుకు మార్చారు. ఈసీజీతో పాటు ప‌లు ప‌రీక్ష‌లు చేశారు. ఆయ‌న ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉంద‌ని అధికారులు తెలిపారు. కాగా, ఉపాధ్యాయ నియామ‌క కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి కేసులో పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో నిన్న‌ సోదాలు జ‌రిపిన ఈడీ రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ప‌శ్చిమ బెంగాల్‌లో గ‌తంలో పార్థ ఛ‌ట‌ర్జీ బెంగాల్‌ విద్యాశాఖ‌ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వ‌చ్చాయి. ఈ కేసుకు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి ఆరోప‌ణ‌ల‌పై ఈడీ విచార‌ణ జ‌రుపుతోంది. మొన్న‌ రాత్రంతా పార్థ ఛ‌ట‌ర్జీని ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. నిన్న‌ అరెస్టు చేసి ఈడీ కార్యాల‌యానికి త‌ర‌లించారు.