Teachers G.O: టీచర్ల జీవో రద్దు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

స్థిర, చరాస్తులు కొనుగోలు చేయాలన్నా అధికారులకు ముందుగానే తెలియజేసి అనుమతి తీసుకోవాలి. అయితే, ఈ జీవోపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఆందోళన, వ్యతిరేకత వ్యక్తమైంది. ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి జీవో ఇచ్చారని విమర్శలు వచ్చాయి.

Teachers G.O: టీచర్ల జీవో రద్దు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

Teachers G.O: టీచర్లు ప్రతి ఏటా ఆస్తుల వివరాలను వెల్లడించాలంటూ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆ జీవోను ఉపసంహరించుకుంది. నిజానికి ఈ జీవో ఈ నెల 8న విడుదలైంది. అయితే, శనివారమే ఈ జీవో వెలుగులోకొచ్చింది. ఈ జీవో ప్రకారం తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తులు, ఆదాయ వివరాలు సమర్పించాలి.

Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ

స్థిర, చరాస్తులు కొనుగోలు చేయాలన్నా అధికారులకు ముందుగానే తెలియజేసి అనుమతి తీసుకోవాలి. అయితే, ఈ జీవోపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఆందోళన, వ్యతిరేకత వ్యక్తమైంది. ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి జీవో ఇచ్చారని విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా తాజా ఉత్తర్వులు జారీ చేశారని, పొరపాటున జీవో విడుదలైందని విద్యాశాఖ భావించింది. దీంతో వెంటనే జీవో నిలుపుదల చేస్తున్నట్లు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. ఈ జీవోను రద్దు చేస్తూ మరో సర్క్యులర్ జారీ చేయాలని సబిత అధికారులను ఆదేశించారు. కాగా, టీచర్లు సహా ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ, ఆస్తి వివరాలు వెల్లడించడం కొత్తదేమీ కాదని, 1968 నుంచి ఈ విధానం అమల్లో ఉందని ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే, దీనిపై తాజాగా ఇచ్చిన సర్క్యులర్ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా కొత్త జీవో ఇచ్చేందుకు సిద్ధమైంది.

Delhi Entry Ban: ఢిల్లీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ.. కారణం ఇదే

నల్గొండకు చెందిన ఒక ప్రధానోపాధ్యాయుడు విధులకు హాజరు కాకుండా రియల్ ఎస్టేట్, ఇతర కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఈడీ విభాగం నిజమేనని తేల్చింది. అలాగే ఉపాధ్యాయుల విషయంలో విజిలెన్స్ శాఖ కొన్ని సూచనలు చేసింది. ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు ఉండాలని, ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని సూచనలు చేసింది. వీటి ఆధారంగా ప్రభుత్వం ఈ నెల 8న జీవో జారీ చేసింది. తాజాగా ఆ జీవో రద్దు చేసింది.