Rajasthan Teachers: భోజన ప్లేట్ల కోసం ఎగబడ్డ ఉపాధ్యాయులు: ‘బుద్ధి ఉందా’ అంటూ నెటిజన్లు చురకలు

భోజన సమయంలో ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు బఫే ప్లేట్‌ల విషయంలో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rajasthan Teachers: భోజన ప్లేట్ల కోసం ఎగబడ్డ ఉపాధ్యాయులు: ‘బుద్ధి ఉందా’ అంటూ నెటిజన్లు చురకలు

Punjab

Rajasthan Teachers: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని భావిభారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయులే..బుద్ధి మరిచారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన టీచర్లే..భాద్యత మరచి ప్రవర్తించారు. భోజన సమయంలో ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు బఫే ప్లేట్‌ల విషయంలో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే పంజాబ్ రాష్ట్రంలో పాఠశాలలో పరిస్థితిపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్, విద్యాశాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. లూథియానాలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ సమీక్షాసమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అయితే సమావేశం ముగిసిన అనంతరం సీఎం, మంత్రి వెళ్లిపోగా..ఉపాధ్యాయుల కోసం సమావేశ ప్రాంతంలోనే భోజనాలు ఏర్పాటు చేశారు.

Also read:Kerala Governor: పదో తరగతి ముస్లిం విద్యార్థినికి స్టేజిపై అవమానం: ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ గవర్నర్

అయితే భోజనాల విషయమై ప్లేట్ల కోసం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పోటీపడ్డారు. కనీస మర్యాదను మరిచి ఒకరినొకరు నెట్టుకుంటూ ప్లేట్లు లాక్కున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయింది. ఉపాధ్యాయులే ఇలా క్రమశిక్షణ కోల్పోయి భోజనాల కోసం కొట్టుకోవడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మీరే ఇలా ఉంటే ఇక విద్యార్థులకు ఏం బుద్ధులు నేర్పిస్తారంటూ ఒకరు కామెంట్ చేస్తే..అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులపై నమ్మకం కోల్పోతున్నాం అంటూ మరొకరు కామెంట్ చేశారు.