ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనికా నుంచి కరోనా, మలేరియా టీకాలు

  • Published By: sreehari ,Published On : December 6, 2020 / 11:27 AM IST
ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనికా నుంచి కరోనా, మలేరియా టీకాలు

Oxford/AstraZeneca coronavirus vaccine Malaria jab : ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన సైంటిస్టుల బృందం మలేరియా టీకాకు సంబంధించి తుది దశ హ్యుమన్ ట్రయల్స్ కోసం రెడీ అవుతున్నారు. ఈ మలేరియా టీకా ట్రయల్స్ లో మంచి ఫలితాలు వస్తే.. ఏడాదికి 5 లక్షల మరణాలను తగ్గించగలదని శాస్త్రవేత్తల బృందం భావిస్తోంది.



ఆక్స్ ఫర్డ్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాల్లో విజయవంతమైంది. మలేరియా టీకాపై ఆఖరి దశ హ్యుమన్ ట్రయల్స్ నిర్వహించనుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, జెన్నర్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు రెండు టీకాలపై పని చేస్తున్నారు.

ట్రయల్స్ ఫలితాల తరువాత వచ్చే ఏడాది ఆఫ్రికాలోని 4,800 మంది పిల్లలపై మలేరియా వ్యాక్సిన్ పరీక్షించనున్నట్టు జెన్నర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అడ్రియన్ హిల్ తెలిపారు. ప్రతి ఏడాది మలేరియా వ్యాధి నుంచి అర మిలియన్ మరణాలను గణనీయంగా తగ్గించగల సామర్థ్యం ఈ టీకాకు ఉందని ప్రొఫెసర్ హిల్ చెప్పారు. మలేరియా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా అభివర్ణించారు. ఈ ఏడాదిలో ఆఫ్రికాలో కోవిడ్‌తో చనిపోయే వారికంటే మలేరియాతోనే ఎక్కువ మంది చనిపోయారన్నారు.



రెండు రెట్లు ఎక్కువ కాదని, బహుశా పది రెట్లు ఉండొచ్చునని అంచనా వేశారు. ప్రస్తుతానికి మలేరియా టీకా పెద్ద మొత్తంలో లభిస్తుందని, చాలా బాగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు.



టీకా చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఫైనల్ హ్యుమన్ ట్రయల్స్ విజయవంతమైతే మాత్రం 2024 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చునని ప్రొఫెసర్ హిల్ తెలిపారు. ఇకపోతే ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం యూకేలో అత్యవసర వినియోగానికి రెగ్యులేటరీ ఆమోదం పొందాల్సి ఉంది.