Shikhar Dhawan: హిందీ సీరియల్లో టీమిండియా క్రికెటర్.. పవర్ ఫుల్ పోలీస్‌గా అదరగొట్టేశాడు.. వీడియో వైరల్
శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు డ్యాన్స్, ఇన్‌స్టా రీల్స్‌తో అభిమానులను అలరిస్తుంటాడు. ఇటీవలకాలంలో టీమిండియా జట్టుకు దూరమైన ధావన్ త్వరలో బాలీవుడ్లో పాపులర్ సీరియల్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Shikhar dhawan
Shikhar Dhawan: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ (Teamindia cricket Shikhar Dhawan) కొత్త అవతారమెత్తాడు. జీ టీవీలో పాపులర్ సీరియల్‌గా పేరుతెచ్చుకున్న కుండలి భాగ్య (Kundali Bhagya) లో నటిస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో శిఖర్ ధావన్ (Shikhar Dhawan)కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను శిఖర్ ధావన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ధావన్ పోలీస్ డ్రస్‌లో కనిపించాడు. ఈ వీడియోనుబట్టి ఆయన సీరియస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లు ఉంది. ఈ వీడియో సోషల్ మీడియా (Social media)లో వైరల్ కావటంతో ధావన్ యాక్టింగ్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Shikhar Dhawan wife : టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సతీమణికి ఢిల్లీ కోర్టు కఠిన ఆదేశాలు
శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు డ్యాన్స్, ఇన్‌స్టా రీల్స్‌తో అభిమానులను అలరిస్తుంటాడు. ధావన్‌కు బాలీవుడ్లో మంచి పరిచయాలే ఉన్నట్లుంది. గతంలో సోనాక్షి సిన్హా, హుమా ఖురేషి యొక్క డబుల్ ఎక్స్ఎల్తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శిఖర్ త్వరలో కుండలి భాగ్య సీరియల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సీరియల్ లో ధావన్ ఒక్క ఎపిషోడ్ కు మాత్రమే కనిపిస్తాడని తెలుస్తోంది.
Shikhar Dhawan: సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న క్రికెటర్లు.. మొన్న ధోని ఇవాళ గబ్బర్!
శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం అతను జట్టుకు దూరమయ్యాడు. ఫామ్ కోల్పోయిన ధావన్.. ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్‌లకు ఎంపిక కాలేదు. గతేడాది చివరిలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ధావన్ ఆడిన విషయం విధితమే. మార్చి 31 నుంచి జరిగే ఐపీఎల్ టోర్నీలో ధావన్ ఆడనున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ధావన్ వ్యవహరించబోతున్నాడు.
View this post on Instagram