‘ఖిలాడి’ తో అనసూయ..

‘ఖిలాడి’ తో అనసూయ..

Anasuya Bharadwaj: ఈ సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ, ‘రాక్షసుడు’ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’.. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

https://10tv.in/action-king-arjun-on-board-for-khiladi/

రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు కాగా సీనియర్ నటుడు ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ‘ఖిలాడి’ లో ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు టీం తెలిపారు.

Khiladi

అనసూయ షూటింగ్‌లో జాయిన్ అయ్యారని, ఈ సినిమాలో ఆమె కథను కీలక మలుపుతిప్పే క్యారెక్టర్‌లో కనిపించనున్నారని సమాచారం. సమ్మర్ స్పెషల్‌గా మే 28న ‘ఖలాడి’ థియేటర్లలోకి రానున్నాడు. రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.