Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం

ఉద్యోగుల రాజీనామాలు నిలువరించేందుకు అన్ని అస్త్రాలు సంధిస్తున్న యాజమాన్యాలు..చివరగా జీతాలు పెంచేతేగాని పరిస్థితి దారిలోకి రాదన్న నిర్ణయానికి వచ్చాయి

Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం

Tech

Employee Retention: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం “గ్రేట్ రెజిగ్నషన్ (పెద్ద సంఖ్యలో ఉద్యోగుల రాజీనామా)” కొనసాగుతుంది. టెక్ ఉద్యోగాలతో విసిగివేసారిపోయిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఉద్యోగుల రాజీనామాలను నిలువరించి..వారితో సక్రమంగా పని చేయించుకునేందుకు టెక్ సంస్థలు నానా అవస్థలు పడుతున్నాయి. ఒక్క భారత్ లోనే దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, వంటి ఇతర సంస్థల్లో ఈ ఏడాది ఆరంభం నుంచే వేలాది మంది ఉద్యోగులు రాజీనామాలు సమర్పించారంటే పరిస్థితి తీవ్రతకు అర్ధం పడుతుంది. ఈక్రమంలో ఉద్యోగులను రాజీనామాల వైపు ద్రుష్టి పెట్టకుండా..వారిని నిలువరించేందుకు భారీ తాయిలాలతో ముందుకు వస్తున్నారు టెక్ యాజమాన్యాలు. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల అందరి జీతాలను రెట్టింపు చేస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Other Stories: Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు

కింది స్థాయి ఉద్యోగి నుంచి..మధ్య స్థాయి వరకు..అందరి జీతాలు రెట్టింపు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ ఇటీవల సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పెంచిన జీతాలు నిపుణులైన మధ్య స్థాయి ఉద్యోగులకు, కొత్తగా చేరిన వారికీ కూడా వర్తించనుంది. అయితే జనరల్ మేనేజర్స్, ఉపాధ్యక్షులు మరియు ఇతర ఉన్నత అధికారులకు ఈ పెంపు వర్తించదు. అటు ఈ కామర్స్ సంస్థ అమెజాన్, సైతం కార్పొరేట్, టెక్ ఉద్యోగుల జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏడాదికి 6 లక్షల డాలర్ల జీతం తీసుకుంటున్న ఉన్నతోద్యోగులకు ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) డాలర్ల జీతం పెంచింది అమెజాన్. ఇక మరో టెక్ దిగ్గజం గూగుల్ మాత్రం..ఉద్యోగుల జీతాల పెంపుపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ మిగతా సంస్థల బాటలోనే గూగుల్ కూడా ఉండనుందని తెలిసింది. ఇప్పటికే సంస్థలోని టాప్ నలుగురు ఎగ్జిక్యూటివ్ ల జీతాలను భారీగా పెంచింది గూగుల్.

Other Stories: Jet Airways: మూడేళ్ల తర్వాత ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్ విమానాలు

కాగా, కోవిడ్ అనంతరం టెక్ ఉద్యోగాల్లో తెలియకుండానే అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం ప్రారంభించాక..ప్రాజెక్టుల్లో భిన్న మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో పని వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులకనుగుణంగా ఉద్యోగులు సర్దుబాటు కాలేకపోతున్నారు. దీంతో అప్పటికే లక్షల వేతనం తీసుకుంటున్నా..టెక్ ఉద్యోగం మాత్రం చేయలేమంటూ ఊసురోమంటున్నారు. ఈక్రమంలోనే ఉద్యోగులందరూ మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తున్నారు.

Other Stories: Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్‌ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?

ఒక అంచనా ప్రకారం గత 40 ఏళ్లలో..ఎన్నడూ ఇంతలా ఉద్యోగులు రాజీనామాలు సమర్పించ లేదంటే కార్పొరేట్ సంస్థల్లో పనితీరు ఎలా ఉందొ అర్ధం అవుతుంది. ఇక ఉద్యోగుల రాజీనామాలు నిలువరించేందుకు అన్ని అస్త్రాలు సంధిస్తున్న యాజమాన్యాలు..చివరగా జీతాలు పెంచేతేగాని పరిస్థితి దారిలోకి రాదన్న నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుత ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులను వదులుకోవడానికి సిద్ధంగా లేని సంస్థలు ఆమేరకు రెట్టింపు జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు..ఉన్న ఉద్యోగులను పోగొట్టుకోకుండా..కొత్త మరియు ఫ్రెషర్స్ ను ఊరిస్తున్నాయి టెక్ సంస్థలు.