10th మెమోలు రెడీ..1.4 లక్షల మంది విద్యార్థులకు 10/10 GPA

  • Published By: madhu ,Published On : June 23, 2020 / 12:47 AM IST
10th మెమోలు రెడీ..1.4 లక్షల మంది విద్యార్థులకు 10/10 GPA

పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పాస్ మెమోలను 3 రోజుల్లో అందనున్నాయి. పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్స్ ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకొనేలా ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తులు చేస్తోంది. మెమోలపై ప్రధానోపాధ్యాయులు సంతకాలు చేసిన తర్వాత..విద్యార్థులకు వాటిని అందచేయాలని సూచిస్తోంది.

మెమోలతో విద్యార్థులు కాలేజీల్లో చేరవచ్చని, పూర్తిస్థాయి మెమోలను మరో నెల రోజుల్లో పంపించనున్నట్లు వెల్లడించింది. 2020, జూన్ 22వ తేదీ సోమవారం  విద్యార్థుల గ్రేడ్‌లు, గ్రేడ్‌ పాయింట్స్, గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌తో (జీపీఏ) కూడిన ఫలితాలను సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. 

ఇంటర్నల్ మార్కుల ఆధారంగా..1.4 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు, ఇంటర్నల్ 20 మార్కుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు (ఐదింతలు) ఆధారంగా జీపీఏ నిర్ణయించడంతో ఎక్కువ మంది విద్యార్థులకు జీపీఏ వచ్చిందని తెలుస్తోంది.

ఇంటర్నల్ లో ఎన్ని మార్కులు వచ్చాయో..అన్నే మార్కులు వేయడంతో పాఠశాలల విద్యార్థుల్లో తక్కువ మందికి 10/10 జీపీఏ వచ్చినట్లు అంచనా. పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన 5,34,909 మంది విద్యార్థుల్లో 3.74 లక్షల మంది కార్పొరేట్, ప్రైవేటు స్టూడెంట్స్ ఉన్నారు. 10/10 జీపీఏ వచ్చిన 1.4 లక్షల మంది విద్యార్థుల్లో 98 శాతం మంది కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే ఉన్నట్లు సమాచారం.