Telangana 10th Results: మళ్లీ మొదటికి వచ్చిన మార్కుల కేటాయింపు అంశం!

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు అంశం మళ్ళీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తుంది. సీబీఎస్ఈ ఎలా మార్కులను కేటాయిస్తే తెలంగాణలో కూడా అలానే కేటాయించనున్నామని ఇక్కడి అధికారులు అప్పుడు ప్రకటించారు.

Telangana 10th Results: మళ్లీ మొదటికి వచ్చిన మార్కుల కేటాయింపు అంశం!

Telangana 10th Results

Telangana 10th Results: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు అంశం మళ్ళీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తుంది. సీబీఎస్ఈ ఎలా మార్కులను కేటాయిస్తే తెలంగాణలో కూడా అలానే కేటాయించనున్నామని ఇక్కడి అధికారులు అప్పుడు ప్రకటించారు. కానీ, శనివారం సీబీఎస్ఈ ఈ ఏడాదిలో పలు దఫాలుగా నిర్వహించిన పరీక్షల ఆధారంగా ఫైనల్ మార్కులు కేటాయిస్తామని చెప్పింది. దీంతో తెలంగాణ అధికారులు ఈ అంశంలో డైలమాలో పడాల్సి వచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విరుచుకుపడుతుంది. దేశంలో రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకు పైగా రోజుకు కొత్త కేసులు నమోదవుతుండటంతో పలు రాష్ట్రాలు టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదాలు రద్దు చేసుకున్నాయి. కేంద్రం కూడా సీబీఎస్ఈని రద్దు చేసింది. సీబీఎస్ఈ ప్రకటించడంతోనే తెలంగాణ అధికారులు కూడా టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. సీబీఎస్ఈ మార్కుల కేటాయింపులో ఎలాంటి విధానాన్ని అవలంభిస్తే తాము కూడా తెలంగాణ టెన్త్ లో కూడా అదే విధానాన్ని అవలంభిస్తామని చెప్పారు.

అయితే శనివారం సీబీఎస్ఈ తన విధానాన్ని ప్రకటించింది. విద్యార్థులకు ప్రతీ సబ్జెక్టులో ఇంటర్నల్స్ కు 20 మార్కులతో పాటు మిగతా 80 మార్కులను ఈ ఏడాది పాటు నిర్వహించిన వివిధ పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా కేటాయించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని తెలంగాణలో అనుసరించే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 44 రోజులు మాత్రమే ప్రత్యక్ష తరగతులను నిర్వహించగా.. కేవలం ఓకే ఒక పరీక్షను నిర్వహించారు. దీంతో దాని ఆధారంగా మార్కుల కేటాయింపు సాధ్యపడేలా కనిపించడం లేదు. దీంతో ఈ మార్కుల అంశంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.

Read: Election Results 2021: బెంగాల్, తమిళనాడులో మొదలైన సంబరాలు!