Bhadradri : భద్రాద్రి రామయ్య వైకుంఠ ద్వార దర్శనం..ఏడు వారాల నగల అలంకరణలో కనువిందు చేసిన సీతారాములు

భద్రాద్రి రామయ్య వైకుంఠ ద్వార దర్శనం అంగరంగ వైభోగంగా జరిగింది..ఏడు వారాల నగల అలకరణలో సీతారాములు కనువిందు చేశారు.

Bhadradri : భద్రాద్రి రామయ్య వైకుంఠ ద్వార దర్శనం..ఏడు వారాల నగల అలంకరణలో కనువిందు చేసిన సీతారాములు

Bhadradri Ramayya vaikuntha Dwara Darshanam

Bhadradri Ramayya Vaikuntha Dwara darshanam : భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనం వేడుక అంగరంగ వైభోగంగా జరిగింది. సకల రాజలాంఛనాలతో ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను ఉత్తర ద్వారం వద్దకు తీసుకువచ్చి న అర్చకులు వైకుంఠ ద్వార దర్శనం వేడుకను నిర్వహించారు. భక్త రామదాసు చేయించిన ఏడువారాల నగలతో సీతారాములను అలంకరించిన అర్చకులు.

వేయికాంతులతో వెలిగిపోయే సీతారాములు ఏడు వారాల నగల అలంకరణలో మరింత దేదీప్యమానంగా శోభాయమానంగా వెలిగిపోయారు.లక్ష్మణ సమేత సీతారాములను వైకుంఠ ద్వార గుండా దర్శనం కనుల విందుగా జరిగింది.భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనం వేడుకను ఆలయ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ వేడుక నిర్వహించారు.

ఈ ఉత్సవం జరుగుతున్నంతసేపు భక్తుల దర్శనాలను నిలిపివేసారు అధికారులు. ఉత్తర ద్వార దర్శనం, తిరువీధి సేవ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు.కాగా బుధవారం సాయంత్రం భద్రాచలం రామాలయంలో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. భక్తరామదాసు కాలం నుంచి పవిత్ర గోదావరి నదిలో ఈ ఉత్సవం చేస్తున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశికి ముందు రోజు సాయంత్రం దీన్ని నిర్వహించడం ఆనవాయితీ.

కానీ కరోనా కారణంగా ఈసారి కరోనా ఆంక్షల కారణంగా గోదావరిలో ఈ వేడుక నిర్వహించలేదు.. బేడా మండపం సమీపంలోని పుష్కరిణిలో స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు భక్తులను అనుమతించకుండా నిరాడంబరంగా వేడుకలు పూర్తి చేశారు. గోదావరి నుంచి తీర్థబిందెలు తీసుకొచ్చి సంప్రోక్షణ చేశారు. స్వామి, అమ్మవారి విగ్రహాలను మేళతాళాల మధ్య ప్రధాన ఆలయం నుంచి మండపానికి తీసుకువచ్చారు. అనంతరం రాములోరిని హంసవాహనంపై ఉంచి తెప్పోత్సవ పూజలు చేశారు.