Updated On - 7:44 am, Sun, 7 March 21
తెలంగాణ బడ్జట్ సమావేశాలు మార్చి మూడో వారంలో మొదలు కాబోతున్నాయి. మార్చి 18వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేసీఆర్ శాఖలవారీగా నేటి(07 మార్చి 2021) నుంచి సమీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ఇప్పటికే సమీక్షలో స్పష్టం చేశారు కేసీఆర్. మార్చి 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టేందుకు సర్కారు ఇప్పటికే సిద్ధం అయ్యింది.
2021-22 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను ఆర్థిక శాఖ అధికారులు రూపొందించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించగా.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఆర్థిక మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ అధికారులు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం గతేడాది 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 1 లక్షా 82 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
కరోనా, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రాకపోవడంతో.. బడ్జెట్‌ను సుమారుగా 20 శాతం వరకు కుదించాలని భావిస్తోంది సర్కార్. అందుకు తగ్గట్టే బడ్జెట్ ప్రతిపాదనలని సీఎంకు అందించారు అధికారులు. సీఎం పరిశీలన తర్వాత బడ్జెట్ పద్దుల ప్రతిపాదనలపై తుది కసరత్తు జరగనుంది. అనంతరం శాఖల వారీగా పూర్తి స్థాయిలో నిధుల కేటాయింపు జరుగుతుంది.
TRS By Election : బీజేపీ కోసం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, ఉపఎన్నికల్లో పోటీకి దూరం..
YS Sharmila : ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతా..అప్పటివరకు మంచి నీళ్లు కూడా ముట్టను.. షర్మిల శపథం..
KCR: భగత్‌కు ఎట్లెట్ల ఓట్లు పడితే అట్లట్ల నెల్లికల్ లిఫ్టులో నీళ్లు
Sagar Bypoll : ఎన్నికలు వస్తే..ఆగమాగం కావొద్దు – కేసీఆర్
Farmers Petition: సాగర్‌లో సీఎం సభను రద్దు చేయాలి : హైకోర్టులో రైతుల పిటిషన్
Rs 2000 Scheme : ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.32 కోట్లు విడుదల