CM KCR Criticized : కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బ తీస్తున్నాయి : సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బ తీస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి..కానీ మోదీ మాత్రం సెస్ ల పేరుతో రాష్ట్రాల వాటా ఎగ్గొడుతున్నారని విమర్శించారు. ఇది సహకార సమాఖ్య వ్యవస్థా..దోపిడీ వ్యవస్థా? అని ప్రశ్నించారు. సహకార వ్యవస్థ పోయి నియంతృత్వ వ్యవస్థ వచ్చిందన్నారు.

CM KCR Criticized : కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బ తీస్తున్నాయి : సీఎం కేసీఆర్

CM KCR criticized central government

CM KCR criticized : కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బ తీస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి..కానీ మోదీ మాత్రం సెస్ ల పేరుతో రాష్ట్రాల వాటా ఎగ్గొడుతున్నారని విమర్శించారు. ఇది సహకార సమాఖ్య వ్యవస్థా..దోపిడీ వ్యవస్థా? అని ప్రశ్నించారు. సహకార వ్యవస్థ పోయి నియంతృత్వ వ్యవస్థ వచ్చిందన్నారు. ముఖ్యమంత్రులే బుల్డోజింగ్ చేస్తామనే స్థాయికి వచ్చిందని వాపోయారు. కొందరు మంత్రులే ఎన్ కౌంటర్లు చేస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో పట్టపగలు కత్తులు పట్టుకుని తిరిగారని వెల్లడించారు.

అన్ని రంగాల్లో దేశం సర్వనాశనమైందన్నారు. నీతి ఆయోగ్ ఎజెండాలో కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని కాకి ఎత్తుకుపోయిందని వెల్లడించారు. నీతి ఆయోగ్ లో సీఎం స్థాయి వ్యక్తులకు కూడా టైమ్ లిమిట్ పెడుతున్నారని..కొంచెం ఎక్కువ సేపు మాట్లాడితే బెల్ కొడుతున్నారని తెలిపారు. గతంలో ప్లానింగ్ కమిషన్ తో వాదించి నిధులు తెచ్చుకునే అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు నీతి ఆయోగ్ లో ఎవరు ప్రణాళికలు తయారు చేస్తున్నారో కూడా తెలియదన్నారు.

CM KCR Letter : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ..నీతి ఆయోగ్ సమావేశాన్ని బష్కరిస్తున్నాం

దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయని వాపోయారు. 13 నెలలపాటు రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధాని క్షమాపణ చెప్పి చట్టాల్ని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీలోనే మంచినీళ్లు ట్యాంకర్లతో సప్లయ్ చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. చివరకు ఉపాధిహామీ కూలీలు కూడా ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

దేశంలో ద్వేషం, అసహనం పెరిగిపోయాయని పేర్కొన్నారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. రూపాయి విలువ పాతాళానికి పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం పెరిగిందన్నారు. దేశం నుంచి లక్షల కోట్లు తరలిపోతున్నాయని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్నారు. కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపే అంశాలపై చర్చ లేదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మోదీ హామీలు జోక్ గా మారిపోయాయని పేర్కొన్నారు.