KCR Target BJP : నీ ఇంటికొస్తా.. కేసీఆర్ టార్గెట్ కమలం.. బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం

కారు సారు గేర్ మార్చారు. కమలమే టార్గెట్ గా రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. ఇక మాటల్లేవ్. మాట్లాడుకోవటాలు లేవ్. అక్కడో ఇక్కడో కాదు కమలనాథుల సొంత గ్రౌండ్ లోనే రేస్ కి రెడీ అయిపోయారు.

KCR Target BJP : నీ ఇంటికొస్తా.. కేసీఆర్ టార్గెట్ కమలం.. బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం

KCR Target BJP : కారు సారు గేర్ మార్చారు. కమలమే టార్గెట్ గా రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. ఇక మాటల్లేవ్. మాట్లాడుకోవటాలు లేవ్. అక్కడో ఇక్కడో కాదు కమలనాథుల సొంత గ్రౌండ్ లోనే రేస్ కి రెడీ అయిపోయారు. తాను అనుకోవడమే లేట్. ఒక్కసారి కమిట్ అయితే వెనుదిరిగి చూసేది కూడా లేదంటూ రంగంలోకి దూకేశారు. ఫామ్ హౌజ్ పంచాయతీతో రగిలిపోతున్న గులాబీ బాస్ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైపోయారు. ఇక సమరమే అని తేల్చి చెప్పేశారు. రాష్ట్ర ప్రభుత్వాలపై రాక్షస క్రీడలు ఇక సాగవని, అది దేశమంతా తెలిసేలా ఊరువాడ తిరిగి డప్పు కొట్టి మరీ చాటి చెప్పేందుకు సిద్ధమైపోయారు. మంది మార్బలంతో రాజకీయ యుద్ధానికి సన్నాహాలు మొదలుపెట్టారు.

మునుగోడు ఉపఎన్నిక రెండు పార్టీల మధ్య కార్చిచ్చు రగిల్చింది. ఓవైపు అధికార టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ.. నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఎవరో ఒక్కరే మిగలాలి అన్నంత స్థాయిలో హోరాహోరీగా పోరాడారు. అది కేవలం ఎన్నికల గ్రౌండ్ లో మాత్రమే కాదు తెరవెనుక వ్యూహాల్లోనూ అదే ఫైట్. ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయంటే.. ఆ తర్వాత అంతా మన కంట్రోల్ లోకి వచ్చేయాలన్నంత పకడ్బందీగా పావులు కదిపాయి.

ఇంతలో ఫామ్ హౌజ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల ఎపిసోడ్. అంతే.. ఒక్కసారిగా సీన్ హాట్ హాట్ గా మారింది. పోటీ పీక్స్ కి చేరింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని పెద్దలు దొడ్డిదారులు వెతుక్కుంటూ వచ్చారంటూ గులాబీ బాస్ కేసీఆర్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఇక ఉపేక్షించేది లేదు, దెబ్బకు దెబ్బ.. టిట్ ఫర్ టాట్ తప్పదన్నట్లుగా ప్రత్యక్ష పోరుకి రెడీ అయిపోయారు. పక్క ప్లాన్ ని ఫిక్స్ చేశారు. రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. అందుకు కమలనాథుల సొంత కోటలో జరగనున్న ఎన్నికల జాతరే సరైన సమయంగా డిసైడ్ అయ్యారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణ వీధుల్లో కాదు గుజరాత్ గల్లీలో తేల్చుకుందాం అంటూ ఎన్నికల వేళ కమలం పార్టీకి సవాల్ విసిరారు. అక్కడికి వెళ్లి గట్టి షాక్ ఇవ్వాలని నిర్ణయించారు. గుజరాత్ ఎన్నికల నగారా మోగిన వేళ.. తెలంగాణ సీఎం కేసీఆర్ అహ్మదాబాద్ బాట పట్టేందుకు రెడీ అయ్యారు. 60 నుంచి 70 మంది గులాబీ దళంతో కమల దళానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అస్త్రాలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ఢిల్లీ స్థాయిలో ఎలా కుట్రలు జరుగుతున్నాయో అక్కడి ప్రజలకు కూడా వివరిస్తామంటున్నారు టీఆర్ఎస్ నేతలు.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయనున్నారు. ఫామ్ హౌజ్ వీడియోలను వేసి చూపిస్తామని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

మీరు హైదరాబాద్ వచ్చి కుట్రలు చేస్తే.. మేము రాలేమా? అంటున్నారు కేసీఆర్. గాంధీనగర్ చేరి వీధి వీధి తిరిగి కమలనాథుల కుట్రలని కరపత్రాలు పంచినట్లుగా ప్రతి ఒక్కరికి తెలిసేలా ప్రచారం చేయనున్నారు కేసీఆర్. ఇప్పటికే ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఆడియోలు, ఆధారాలు విడుదల చేసిన కేసీఆర్.. ఆ సంభాషణలను పొరుగు రాష్ట్రాల స్థానిక భాషల్లోకి కూడా అనువాదం చేయించేందుకు సిద్ధమయ్యారు. అది కూడా ఒక గుజరాత్ కే పరిమితం కాదు. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ కూడా వెళ్లనున్నారు. చల్లని రాష్ట్రంలో చలి కాచుకునేంత హీట్ రాజేసేందుకు ప్లాన్ రెడీ చేసేశారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు కేసీఆర్. కేసీఆర్ తానే స్వయంగా వెళ్లడం, తనతో 60 నుంచి 70మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకుని వెళ్లనుండటం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక రాష్ట్ర సీఎం ఏకంగా దేశ ప్రధానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు రాష్ట్రాల హద్దులు దాటి వెళ్లనుండటం వ్యూహాత్మకమే.