Telangana Congress: టీ కాంగ్రెస్ సీనియర్ నేతల సుదీర్ఘ సమావేశం: ఇటీవల పరిణామాలు సోనియా దృష్టికి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు సోమవారం సుదీర్ఘ సమావేశంలో పాల్గొన్నారు.

Telangana Congress: టీ కాంగ్రెస్ సీనియర్ నేతల సుదీర్ఘ సమావేశం: ఇటీవల పరిణామాలు సోనియా దృష్టికి

T Congress

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు సోమవారం సుదీర్ఘ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలు సహా.. ఐదు రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై చర్చించినట్లు నేతలు వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ..తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించినట్లు తెలిపారు. జగ్గారెడ్డి అంశం సహా ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చించామని..త్వరలో అధిష్టానం దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తామని వీహెచ్ తెలిపారు. మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో సంస్థాగతమైన మార్పులు జరగాలని వర్కింగ్ కమిటీ సభ్యులు కోరారని, ఈ విషయాన్ని అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు.

Also read: Pawan Kalyan: జగన్ పాలనలో జరిగింది.. జరిగేది ఇదే..! జనసేన ఆవిర్భావ సభలో విరుచుకుపడిన పవన్

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలనే విషయాలపై చర్చించామన్నారు. పార్టీపై ప్రజల విశ్వాసం ఏవిధంగా పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉంటాయని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా తాము ఈసందర్భంగా చర్చించినట్లు శశిధర్ రెడ్డి తెలిపారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్నవారు.. పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలి అంటూ శశిధర్ రెడ్డి అన్నారు. ఇక ఈ సమావేశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ..బయట జరుగుతున్న ఊహాగానాలకు.. నేడు జరిగిన సమావేశానికి సంబంధం లేదని అన్నారు.

Also read: Nagababu : జగన్ మళ్లీ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా పక్క రాష్ట్రాలకు వెళ్లాలి : నాగబాబు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమి పై జాతీయ స్థాయిలో ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశంపై తాము చర్చించామని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని.. ఆ కుటుంబం అడుగు జాడల్లో కార్యకర్తలు నడుస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే విషయంపై.. పార్టీతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధంగా కొనసాగుతున్న నేతలం కలిసి చర్చించుకున్నామని ఆయన అన్నారు. వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయి.. అవన్నీ మీడియాకు చెప్పలేను అని జగ్గారెడ్డి అన్నారు.

Also read: Telangana High Court : సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన