Covid Vaccination : కోవిడ్ టీకాలో 4కోట్ల మార్కును దాటిన తెలంగాణ

కోవిడ్ టీకా పంపిణీలో తెలంగాణ రాష్ట్రం మరో మైలు రాయిని అధిగమించింది. నిన్న ఉదయానికి  కోవిడ్ వ్యాక్సినేషన్‌  వేయటంలో 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదట

Covid Vaccination : కోవిడ్ టీకాలో 4కోట్ల మార్కును దాటిన తెలంగాణ

Telangana Vaccinatio

Covid Vaccination :  కోవిడ్ టీకా పంపిణీలో తెలంగాణ రాష్ట్రం మరో మైలు రాయిని అధిగమించింది. నిన్న ఉదయానికి  కోవిడ్ వ్యాక్సినేషన్‌  వేయటంలో 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. డిసెంబర్ 31వ తేదీ లోపల వంద శాతం టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వైద్యారోగ్య శాఖ కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆదేశాల మేరకు మరింత స్పీడ్‌గా వాక్సినేషన్ ప్రక్రియ‌ను పూర్తి చేసేందుకు ఆరోగ్య శాఖ అధికారులు అన్నివిధాల కృషి చేస్తున్నారు.

వాక్సినేషన్ చేయటానికి ప్రత్యేక డ్రైవ్ లు  చేపట్టి  ఇంటింటి సర్వే నిర్వహించి టీకాలు కార్యక్రమం నిర్వహిస్తోంది ఆరోగ్య శాఖ. ఎవరైనా వాక్సిన్ తీసుకోని వారు ఉంటే వారికి టీకా తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయో వివరిస్తున్నారు. ఈ నెల 31 వ తేదీ లోపల 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలని సీఎం ఆదేశాలతో వేగంగా వాక్సినేషన్ జరుగుతుంది.

ఇప్పటికే కొన్ని జిల్లాలో సూచించిన టార్గెట్ దాటిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 94 శాతానికి పైగా మొదటి డోస్ కంప్లీట్ కాగా, 2వ డోస్ 50 శాతం పూర్తి అయింది. జిల్లాలు వారిగా మొదటి డోస్, రెండో డోస్  వాక్సినేషన్ ఈ విధముగా  నమోదు అయింది.

రంగారెడ్డి ఫస్ట్ డోస్ 109 శాతం శాతం, సెకండ్ డోస్ 72 శాతం,
హైదరాబాద్ 107 శాతం, సెకండ్ డోస్ 75,
మెదక్101 శాతం, సెకండ్ డోస్ 45
హన్మకొండ 99 శాతం, సెకండ్ డోస్ 70,
వనపర్తి 98 శాతం, సెకండ్ డోస్ 27,
కరీంనగర్ 98 శాతం, సెకండ్ డోస్ 75,
ఖమ్మం 98 శాతం, సెకండ్ డోస్ 57
యాదాద్రి భువగిరి జిల్లా 98 శాతం, సెకండ్ డోస్ 60
నారాయణపేట 98 శాతం, సెకండ్ డోస్ 25
మంచిర్యాల 97 శాతం, సెకండ్ డోస్ 43…
జనగామ97 శాతం, సెకండ్ డోస్ 44
మహబూబ్ బాద్ 96 శాతం, సెకండ్ డోస్ 53
నిర్మల్ 96 శాతం, సెకండ్ డోస్ 35
రాజన్న సిరిసిల్ల 94 శాతం, సెకండ్ డోస్ 50
ములుగు 93 శాతం, సెకండ్ డోస్ 48,
సిద్దిపేట్ 93 శాతం,సెకండ్ డోస్ 49
నాగర్ కర్నూల్ 92 శాతం, సెకండ్ డోస్ 27
జయశంకర్ భూపాలపల్లి 92 శాతం,సెకండ్ డోస్ 50,
పెద్దపల్లి92 శాతం , సెకండ్ డోస్48,
జోగులంబా గద్వాల్ 92 శాతం ,సెకండ్ డోస్20,

Also Read : Bird Flu : మరో వైరస్ కలకలం.. కోళ్లు, గుడ్లు, మాంసం వినియోగం, అమ్మకాలపై నిషేధం

మహబూబ్ నగర్ 92 శాతం, సెకండ్ డోస్32,
భద్రాద్రి కొత్తగూడెం 91 శాతం, సెకండ్ డోస్34,
నల్గొండ 90 శాతం, సెకండ్ డోస్40,
వరంగల్ 89 శాతం, సెకండ్ డోస్35
ఆదిలాబాద్ 87 శాతం, సెకండ్ డోస్25…
నిజామాబాద్ 87 శాతం, సెకండ్ డోస్39
వికారాబాద్ 85 శాతం, సెకండ్ డోస్20
సూర్యాపేట 84 శాతం,సెకండ్ డోస్41
జగిత్యాల 84 శాతం, సెకండ్ డోస్39
సంగారెడ్డి 84 శాతం, సెకండ్ డోస్43
మేడ్చల్ 82 శాతం, సెకండ్ డోస్ 59
కామారెడ్డి 81 శాతం, సెకండ్ డోస్ 41
కొమరం భీమ్.. 79 శాతం, సెకండ్ డోస్ 16 శాతం.

అయితే… స్పీడ్ గా వాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేసుకుంటే, థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే శక్తి ప్రజలకు ఉంటుంది కాబట్టి అధికారులు కూడా అదేపనిలో నిమగ్నమయ్యారు. 31 వ తేదీ లోపల వంద శాతం వాక్సినేషన్ ని పూర్తి చేయడానికి సిబ్బంది కృషి చేస్తున్నారు.