నిండు ప్రాణం తీసిన చికెన్ లెగ్ పీస్..ఇటుకల బట్టీలో హత్య

నిండు ప్రాణం తీసిన చికెన్ లెగ్ పీస్..ఇటుకల బట్టీలో హత్య

Telangana : Four people clash for Chicken Leg Piece Issue..one killed : చికెన్ లెగ్ పీస్ కోసం గొడవ పడి, దాడి చేసుకోవడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. చికెన్ లెగ్ పీస్ కోసం జరిగిన నలుగురు గొడవపడ్డారు. వారిలో ఒకరు ప్రాణం కోల్పోగా మిగిలిన ముగ్గురు జైలుపాలయ్యారు. కోడికాళ్ల కోసం నలుగురు కూలీల మధ్య జరిగిన గొడవకాస్తా ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. అతడిని చంపి ఆ విషయం ఎక్కడ బైటపడుతుందోనని భయపడిన మిగిలినవాళ్లు అతడిని దహన కార్యక్రమాలు కూడా చేసేశారు. ఇక ఈ విషయం బైటపడదనుకున్నారు.

కానీ బైటపడింది. ముగ్గురినీ జైలుపాలు చేసింది. తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది బైటపడ్డాక స్థానంగా తీవ్ర కలకలం సృష్టించింది. మద్యం మత్తులో కోడికాళ్లు తినేలనే ఆత్రంతో తోటి స్నేహితుడినే చంపేవరకూ వెళ్లింది. బీమన్స్ అనే స్నేహితుడిని చంపేసి హత్యను ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా క్రియేట్ చేయాలనుకున్న వారి ప్లాన్ బెడిసికొట్టింది.

వివరాల్లోకి వెళితే..ఒడిశాలోని సందరంఘడ్‌ జిల్లా సునాపర్వత్‌ గ్రామానికి చెందిన బసు జోర, పూజ లుంగీయార్‌, బీమ్సన్‌ జోరా, బయా లుంగీయార్‌ అనే నలుగురు వ్యక్తులు, పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని ఓ ఇటుక బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నారు. గత బుధవారం అంటే 9న మార్కెట్‌ నుంచి చికెన్ తెచ్చుకుని వంట చేసుకున్నారు. చికెన్ కూరలోకి మద్యం కూడా ఉండాలి కదా..అలా మద్యం తెచ్చుకున్నారు.వండుకున్న కూరని మధ్యలో పెట్టుకుని మద్యం తాగుతూ జోకులేసుకున్నారు. అలా రాత్రి మద్యం తాగుతుండగా చికెన్ లెగ్ పీస్ విషయంలో బీమ్సన్‌ మిగిలిన వారితో గొడవ పడ్డాడు.

చికెన్ లెగ్‌పీస్ కోసం మొదలైన ఈ గొడవ పెద్దదైంది. దీంతో బీమన్స్‌పై బసు జోర, పూజ లుంగీయార్‌, బయా లుంగీయార్‌‌ల కోపం కట్టలు తెంచుకుంది. అంతే పక్కనే ఉన్న ఓ చెక్క దుంగతో బీమ్సన్‌ తలపై బలంగా బాదారు. ఆ దెబ్బకు బీమన్స్ కు చుక్కలు కనిపించాయి. తీవ్రంగా గాయమైంది. దెబ్బ బలంగా తగలడంతో బీమ్సన్‌ స్పృహ తప్పి పడిపోయాడు.

దీంతో పక్కనున్న మిగతా వారు ఇటుక బట్టీ యజమానులు ఈసారపు శ్రావణ్‌, మేకల మహేష్‌లకు విషయం తెలియజేశారు. బీమ్సన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాలని వారు సూచించడంతో వారంతా సహాయపడ్డారు. ఈక్రమంలో బీమన్స్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బీమన్స్ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

కూలీల మధ్య గొడవ వల్లే బీమ్సన్‌ చనిపోయాడంటే తాము జైలుకెళ్లాల్సి వస్తుందనే భయంతో వాళ్లు బీమన్స్ ప్రమాదవశాత్తూ అతడు చనిపోయాడంటూ ఓ తప్పుడు డెత్ సర్టిఫికేట్ సంపాదించారు. బీమ్సన్‌ చనిపోవడానికి ఇటుక పెళ్లలు పడిపోవడమే కారణమనేలా సృష్టించారు. ప్రైవేట్‌ ఆస్పత్రి నుంచి మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొచ్చారు. అనంతరం.. కరీంనగర్‌ శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు.

ఇందుకు మరో ఇటుక బట్టీ ఓనర్‌ అంబటి సతీష్‌ సహకారం కూడా తీసుకున్నారు. కానీ విషయం బయటికి రావడంతో గీతం శ్రీనివాస్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.