Jio Attendance Govt Schools : ప్రభుత్వ బడుల్లో ‘జియో’ అటెండెన్స్‌.. టీచర్లు, సిబ్బందికి తప్పనిసరి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల హాజరును పటిష్ఠంగా నమోదు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో జియో అటెండెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లాల్లో మొబైల్‌యాప్‌ ద్వారా జియో అటెండెన్స్‌ నమోదుకు అనుమతి ఇచ్చింది.

Jio Attendance Govt Schools : ప్రభుత్వ బడుల్లో ‘జియో’ అటెండెన్స్‌.. టీచర్లు, సిబ్బందికి తప్పనిసరి

jio attendance

Jio Attendance Govt Schools : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల హాజరును పటిష్ఠంగా నమోదు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో జియో అటెండెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లాల్లో మొబైల్‌యాప్‌ ద్వారా జియో అటెండెన్స్‌ నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలిచ్చారు. ఈ జిల్లాల్లోని ప్రభుత్వ మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో జియో అటెండెన్స్‌ను అమలు చేయాలని ఆదేశించారు.

బోధన, బోధనేతర సిబ్బంది హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీచర్లు, సిబ్బంది విధులకు హాజరై సెల్ఫీ తీయగానే ఫొటోతో సరిపోల్చుకొని, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా వారు ఎక్కడున్నారో ఇట్టే గుర్తించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా జియో అటెండెన్స్‌ మొబైల్‌ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. అంతకముందు బడుల్లో బయోమెట్రిక్‌ హాజరును అమలు చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2020 మార్చి నుంచి దీనిని నిలిపివేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరిచేస్తూ ఆగస్టులో ఆదేశాలిచ్చారు.

Biometric : ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ అటెండెన్స్.. కేంద్రం కీలక నిర్ణయం

ఇప్పటివరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కామారెడ్డి, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, గద్వాల, పెద్దపల్లి, నిజామాబాద్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జనగాం, వికారాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో అమలు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ – మల్కాజిగిరి, హైదరాబాద్‌ జిల్లాల్లో మాత్రం బయోమెట్రిక్‌ హాజరు లేదు. దీని స్థానంలో ఇప్పుడు జియో అటెండెన్స్‌ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు.

టీచర్లు స్కూలుకు హాజరైనప్పుడు, విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఫొటో తీసుకోవాలి. ఇంటర్నెట్‌ పనిచేయకపోయినా ఆఫ్‌లైన్‌లో ఉన్నా వివరాలు నమోదవుతాయి. ఇంటర్నెట్‌ పునరుద్ధరించిన తర్వాత యాప్‌ తీసుకుంటుంది. టీచర్లు సెలవు మంజూరైందా లేదా అన్న స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఆన్‌డ్యూటీలో భాగంగా బడుల సందర్శన, తనిఖీలకు వెళ్లిన వివరాలను నమోదు చేయవచ్చు.