Telangana : మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్ మెంట్ కన్ఫామ్

తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. గవర్నర్ ఈరోజు సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉండటంతో మంత్రికి రేపు అంటే శుక్రవారం అపాయింట్ మెంట్ ఇచ్చారు.

Telangana  : మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్ మెంట్ కన్ఫామ్

Telangana governor tamilisai appointment Conform to minister sabitha indra reddy

governors tamilisai appointment to minister sabitha : తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. గవర్నర్ ఈరోజు సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉండటంతో మంత్రికి రేపు అంటే శుక్రవారం (నవంబర్ 11,2022) అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో యూనివర్శిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు విషయంపై మంత్రి చర్చించనున్నారు. దీనిపై కొన్ని రోజులుగా టీఆర్ఎస్..రాజభవన్ మధ్య లేఖ విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ విషయంపై లేఖ రాశామని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.

TRS Vs Governor for letter issue : గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది .. అపాయింట్‌మెంట్ ఇస్తే అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాం : మంత్రి సబిత

కానీ గవర్నర్ నుంచి తమకు ఎటువంటి లేఖా రాలేదని మంత్రి సబిత చేసిన వ్యాఖ్యలపై మరోసారి రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి. మెజెంజర్ ద్వారా సమాచారం ఇచ్చామని స్పష్టం చేశాయి. ఈక్రమంలో మరోసారి మంత్రి సబిత స్పందించి గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని..గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు గురించి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ఉన్న సందేహాలన్నీ క్లారిఫై చేస్తామని తెలిపారు.

Governor Tamilisai: నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనుమానాలున్నాయి.. తెలంగాణ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

దీంతో మంత్రి సబితకు గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్ కేటాయించారు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో తమిళిసై పర్యటన ఉండంతో అపాయింట్ మెంట్ ను రేపు ఖరారు చేశారు. దీంతో రేపు ఉదయం గానీ సాయంత్రం గానీ మంత్రి సబితి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసైతో చర్చించనున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు రాజ్ భనవ్ కు వెళ్లనున్నారు.కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు అభ్యంతరాలపై చర్చించనున్నారు.