Telangana Govt : హైదరాబాద్ లోని 18 ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో పేషెంట్ అటెండెంట్స్ కోసం సబ్సిడీ భోజనం

18వేల 600మందికి ప్రతిరోజు మూడు పూటలా భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఒక్క భోజనానికి 24రూపాయల 25పైసలు ఖర్చు వస్తుంది. అందులో 19 రూపాయల 25పైసలు ప్రభుత్వం భరిస్తుంది.

Telangana Govt : హైదరాబాద్ లోని 18 ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో పేషెంట్ అటెండెంట్స్ కోసం సబ్సిడీ భోజనం

Telangana govt subsidized meals : హైదరాబాద్ నగరంలోని 18 ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో పేషెంట్ అటెండెంట్స్ కోసం సబ్సిడీ భోజనాన్ని అందించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఒక్కొక పేషెంట్ తరపున ఇద్దరు చొప్పున 18 ఆస్పత్రుల్లో 9వేల 94 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో పేషెంట్ అటెండెంట్స్ దాదాపుగా 18 వేల 600 వరకు ఉంటారని అంచనా.

18వేల 600మందికి ప్రతిరోజు మూడు పూటలా భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఒక్క భోజనానికి 24రూపాయల 25పైసలు ఖర్చు వస్తుంది. అందులో 19 రూపాయల 25పైసలు ప్రభుత్వం భరిస్తుంది. సబ్సిడీలో భాగంగా 5రూపాయలకు పేషెంట్ అటెండెంట్స్ కి అందజేయడం జరుగుతుంది.

CM KCR: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్న సీఎం కేసీఆర్

దీని ద్వారా ప్రతిరోజు 55వేల 800 మీల్స్ అందించాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు 10లక్షల 74వేల 150 రూపాయల ఖర్చు అవుతుంది. దాదాపుగా ప్రభుత్వానికి నెలకు 3కోట్ల 22లక్షల భారం పడనుంది. సంవత్సరానికి 38కోట్ల 66లక్షల ఆర్ధిక భారం పడనుంది.