Niloufer hospital ICU 100 beds : జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ : నిలోఫర్‌ ఆస్పత్రిలో 100 పడకల ICU ప్రారంభించిన మంత్రి హరీష్

హైదరాబాద్ నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో 100 ప‌డ‌క‌ల ఐసీయూ వార్డును మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Niloufer hospital ICU 100 beds : జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ : నిలోఫర్‌ ఆస్పత్రిలో 100 పడకల ICU ప్రారంభించిన మంత్రి హరీష్

Minister Harish Rao Launches 100 Bedded Unit In Niloufer Hospita

Niloufer hospital ICU 100 beds : హైదరాబాద్ న‌గ‌రంలోని నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో 100 ప‌డ‌క‌ల ఐసీయూ వార్డును మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చిన్న పిల్ల‌ల్ల వార్డుల‌ను మంత్రి హ‌రీశ్‌రావు సంద‌ర్శించారు. డాక్టర్లతో మాట్లాడారు. పిల్లల తల్లిదండ్రులతో ముచ్చటించారు.ఆ తరువాత మంత్రి మీడియాతో మాట్లాడుతు..వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తామని..అలా జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ తరువాత అన్ని ఆస్పత్రుల్లోను ఐసీయూ వార్డులు కీలకంగా మారాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్య శాఖ‌ను అభివృద్ధి చేస్తామ‌ని మంత్రి తెలిపారు. కరోనా మూడో వేవ్ అంచనాల క్రమంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5000 పడకలు ఏర్పాటు చేశామని హరీశ్ రావు ఈ సందర్భంగా వెల్లడించారు. దీని కోసం సీఎం రూ. 133 కోట్లు విడుదల చేశార‌ని..రూ. 33 కోట్లతో నిలోఫర్‌లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు.

Read more : Mysterious Viral Fever in Pak : కరాచీని వణికిస్తున్న వైరల్ పీవర్స్..! భయాందోళనలో ప్రజలు

ప్రభుత్వ ఆస్పత్తుల్లో అందించే వైద్యం మీద ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలని ఈ సందర్భంగా డాక్టర్లకు, సిబ్బందికి మంత్రి సూచించారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న డెలివరీ రేట్ ఉండేదని కేసీఆర్ కిట్ వచ్చాక 50 శాతానికి పెరిగిందని తెలిపారు. తల్లి, పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. నగరం నలువైపులా నాలుగు మెడికల్ టవర్లు తీసుకురావాలని కృషి చేస్తున్నాని తెలిపారు. కరోన థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రూ. 133 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. వాక్సినేషన్‎లో దేశ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువగా ఉందని..కరోనాను నియత్రించేందుకు డాక్టర్లు మెడికల్ సిబ్బంది మరింత సమయం కేటాయించాలని సూచించారు.

Read more : Maoist Ravi died : బాంబులు తయారుచేస్తుండగా..పేలి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి