High Court : రాహుల్ ఓయూ పర్యటన.. వీసీదే తుది నిర్ణయమన్న హైకోర్టు

అయితే రాహుల్ ఓయూ పర్యటనకు సంబంధించి మళ్లీ వీసీకి దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు తెలిపింది. ఈ సారి దరఖాస్తును వీసీ పరిగణనలోకి తీసుకుంటారని కాంగ్రెస్ నేతలకు సూచించింది.

High Court : రాహుల్ ఓయూ పర్యటన.. వీసీదే తుది నిర్ణయమన్న హైకోర్టు

High Court (1)

Rahul Gandhi’s visit to OU : కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ ఉస్మానియా యూనిర్సిటీ పర్యటనపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతివ్వాలని పిటిషనర్లు కోరారు. పిటిషన్ విచారణను హైకోర్టు ముగించింది. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని ఓయూ వైస్ ఛాన్స్ లర్ కే వదిలివేసింది. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్న విషయంలో వీసీదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే రాహుల్ ఓయూ పర్యటనకు సంబంధించి మళ్లీ వీసీకి దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు తెలిపింది. ఈ సారి దరఖాస్తును వీసీ పరిగణనలోకి తీసుకుంటారని కాంగ్రెస్ నేతలకు సూచించింది. కాంగ్రెస్ నేతల దరఖాస్తును వీసీ పరిశీలిస్తారని తెలిపింది. అయితే రాహుల్ ఓయూ పర్యటకు వీసీ అనుమతిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు వీసీ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీసీ అనుమతిస్తారా లేదా అన్న టెన్షన్ లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

Rahul OU Tour : ఓయూలో రాహుల్ పర్యటనపై రిజిస్ట్రార్‌ లేఖ..అనుమతి నిరాకరణకు కారణాలు వెల్లడి

మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ గాంధీ పర్యటనకు అనుమతించాలంటూ మానవతా రాయ్‌, ప్రతాప్‌ రెడ్డి, జగన్నాథ్‌ యాదవ్‌, చందనా రెడ్డి రాసిన లేఖకు వర్సిటీ రిజిష్ట్రార్‌ లక్ష్మీ నారాయణ సమాధానం ఇచ్చారు. ఏ ఏ కారణాల వల్ల రాహుల్‌ గాంధీ పర్యటనను నిరాకరిస్తున్నామో లేఖ ద్వారా వెల్లడించారు.

యూనివర్సిటీ ఆవరణలో రాజకీయ, మత పరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని గత ఏడాది జూన్‌ 31న వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుందని ఆయన తన లేఖలో గుర్తు చేశారు. అంతేగాక శాంతిభద్రతల నేపథ్యంలో వర్సిటీలో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని కొన్ని విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని, పైగా ఎంబీఏ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారని గుర్తు చేశారు.

Jaggareddy: అడ్డుకున్నా సరే రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతాం: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

అలాగే మే 7న వర్సిటీ ఉద్యోగుల అసోసియేషన్‌ ఎన్నికలు కూడా వున్నాయని, ఈ మధ్యనే ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌ నేపథ్యంలో వేలాదిమంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.