YS Sharmila: షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో ఉన్న తన కూతురు షర్మిలను చూసేందుకు వెళ్తుండగా వైఎస్.విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు.

YS Sharmila: షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

YS Sharmila: తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్ర సందర్భంగా వరంగల్‌లో సోమవారం ఉద్రిక్తత తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె పాదయాత్రను అడ్డుకుని, హైదరాబాద్ తరలించారు.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్.. ఈ వారమే ప్రారంభిస్తామంటున్న ఎలన్ మస్క్

దీంతో ఆమె.. తన పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. నర్సంపేట పోలీసులు పాదయాత్ర అనుమతి రద్దు చేశారని, వెంటనే అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో వైఎస్ఆర్‌టీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లింగగిరి వద్ద పాదయాత్రకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆటంకం సృష్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పాదయాత్రకు అనుమతించింది. పాదయాత్ర కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది. దీనికి అనుమతివ్వాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే సీఎం కేసీఆర్‌పై, రాజకీయ, మతపరమైన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.

Indian Soldiers: సినిమా స్టంట్స్ కాదు.. రియల్ స్టంట్స్.. భారత సైనికుల అద్భుత ప్రతిభకు నిదర్శనం ఈ వీడియోలు

షర్మిలను కలిసేందుకు వెళ్తున్న వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు
ప్రగతి భవన్ వద్దకు వెళ్తున్న షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షర్మిల అక్కడే ఉన్నారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఉన్న షర్మిలను కలిసేందుకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ బయల్దేరారు. వారి నివాసమైన లోటస్ పాండ్ నుంచి షర్మిల వద్దకు వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులు, విజయమ్మ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల వైఖరిపై విజయమ్మ మండిపడ్డారు. దీంతో లోటస్ పాండ్ వద్దే విజయమ్మ దీక్షకు దిగారు. షర్మిల వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. తన కూతురును అరెస్టు చేయడం అమానుషమని, షర్మిల విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని విజయమ్మ వ్యాఖ్యానించారు.