Woman Cry vaccination : ‘టీకా వ‌ద్ద‌మ్మా’..చిన్నపిల్లలాగా దాక్కుని వెక్కివెక్కి ఏడ్చిన బామ్మ‌..

‘వామ్మో..టీకా వ‌ద్ద‌మ్మా’..అంటూ చిన్నపిల్లలాగా దాక్కుని వెక్కివెక్కి ఏడ్చింది ఓ బామ్మ‌. ఈ ఫోటో చూస్తే చిన్నపిల్లలాగా మారాం చేస్తోంది బామ్మ భలే అనిపిస్తోంది.

Woman Cry vaccination : ‘టీకా వ‌ద్ద‌మ్మా’..చిన్నపిల్లలాగా దాక్కుని వెక్కివెక్కి ఏడ్చిన బామ్మ‌..

Old Woman Cry Before Covid Vaccination

old woman cry before covid vaccination : ఇంజెక్షన్ చేయించుకోవాలంటే పసిపిల్లలు ఎలా ఏడుస్తారో..అమ్మా నాన్నల పక్కన దాక్కుంటారో..నాకొద్దు అని ఎలా ఏడుస్తారో కదా..ఇంజెక్షన్ అంటే భయం..సూదితో గుచ్చేస్తారని..నొప్పెడుతుందని భయపడిపోతారు చిన్నపిల్లలు.కానీ పెద్దవాళ్లు వాళ్లను సముదాయించి..‘‘డాక్టర్ గారు నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేస్తారుగా..చేయించుకుంటే ఆయి పోతుందమ్మా’’అని బుజ్జగించి బతిమాలి చేయిస్తారు. ఇలా చిన్నపిల్లలే కాదు చాలామంది పెద్దవాళ్లకు కూడా ఇంజెక్షన్ అంటే భయపడిపోతారు. ఇంజెక్షన్ వద్దు డాక్టర్..ట్యాబ్లెట్స్ రాయండి అని అడుగుతారు చిన్నపిల్లల్లాగా..కానీ కొన్ని పరిస్థితుల్లో సూది మందు తప్పనిసరి..ఈ కరోనా కాలంలో టీకా కూడా అంతే. తప్పకుండా వేయించుకోవాల్సిందే. ఒక్క క్షణం ఓర్చుకుంటే టీకా వేయించుచేసుకోవచ్చు.

కానీ..సూది మందు అంటే భయపడేవారికి..కరోనా వ్యాక్సిన్ వేయటానికి ఆరోగ్య కార్యకర్తలు అచ్చు అమ్మల్లాగానే నచ్చ చెప్పి మరీ వేస్తున్నారు. వ్యాక్సిన్ వద్దు అనేవాళ్లకు ఎలా వివరించి చెప్పి మరీ వేస్తున్నారో..సూది మందు అంటే భయపడేవారికి కూడా అచ్చు అమ్మ లాగే బుజ్జగించి..బతిమాలి ‘నొప్పి లేకుండా వేస్తానుగా..’ అని మరీ వేస్తున్నారు.

ఇదిగో ఈ బామ్మకు కూడా ఓ ఆరోగ్య కార్యకర్త అలాగే కరోనా వ్యాక్సిన్ వేసింది. అచ్చు అమ్మలాగా..ఖమ్మం జిల్లా చింత‌కాని మండ‌లం‌ నాగి‌లి‌గొండకు చెందిన అరి‌కొట్ల సాభా‌గ్యమ్మ అనే వృద్ధురాలు కరోనా మొదటి డోసు వేయించుకుంది. రెండో డోసు వేయించుకోవాలి. కానీ వేయించుకోవట్లేదు. ఎంతమంది చెప్పినా వినట్లేదు.

ఈక్రమంలో శుక్ర‌వారం (డిసెంబర్ 10,2021) ఆరోగ్యకార్యక్తలు నాగిలిగొండకు వచ్చారు. సౌభాగ్యమ్మకు కూడా రెండో టీకా వేసు‌కో‌వా‌లని చెప్పారు.దానికి సౌభా‌గ్య‌మ్మ ‘బాబోయ్ నాకు భయం వద్దు’..అంటూ చిన్నపిల్లలాగా వెక్కివెక్కి ఏడ్చింది. అక్కడే ఉన్న వైద్య‌సి‌బ్బందికి చెందిన ఓ వ్యక్తి చేయి పట్టేసుకుని అచ్చం చిన్నపిల్లలాగా దాక్కుంది. దీంతో ఆమెకు ఆరోగ్యకార్యకర్త ‘ ‘నీ పాణం కోసమే కదా అవ్వా..’ అంటూ సము‌దా‌యించి..నచ్చ‌జెప్పి వ్యాక్సిన్‌ వేసింది. ఆ తర్వాత కూడా ఆమె చిన్నపిల్లలాగా ఏడుస్తునే ఉంది. స్థానికులు ఊరుకో అవ్వా..నువ్వు బాగుండాలనే కదా అంటూ ఓదార్చారు. ఏడుపు మానేదాకా బుజ్జగించారు. సదరు బామ్మ వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు అచ్చు చిన్నపిల్లలాగా అనిపిస్తోంది ఈ ఫోటో చూస్తే..అందుకే అంటారేమో..‘చిన్నపిల్లలు వృద్ధులు ఒక్కటే ’అని..