Telangana : హెల్త్ హబ్ గా వరంగల్..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం : మంత్రి ఎర్రబెల్లి

హెల్త్ హబ్ గా వరంగల్ ను తీర్చిదిద్దుతున్నామని..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Telangana : హెల్త్ హబ్ గా వరంగల్..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం : మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Dayakar Rao Inaugurates Ct Scan At Warangal

Minister Errabelli Dayakar rao inaugurates ct scan at warangal : వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని..పేదవారు ఇకనుంచి వైద్యం గురించి ఏమాత్రం దిగులు పడవద్దని..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం అందేలా వరంగల్ ను తీర్చి దిద్దుతున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వైద్యరంగం సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతోను..మంత్రి హరీశ్‌రావు కృషితోను రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌లో రూ.2.14కోట్ల విలువైన కొత్త సిటీస్కాన్‌ను ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీస్కాన్‌ మిషన్‌ పనితీరు తదితర వివరాలపై సూపరింటెండెంట్‌, టెక్నీషియన్స్‌ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా ప్రకటించిందని..హైదరాబాద్‌ తర్వాత ఆ స్థాయి వైద్యసదుపాయాలు వరంగల్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం అని అన్నారు. ఈ సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రూ.1100 కోట్లతో అతిపెద్ద ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్లు కార్పొరేట్ స్థాయిలో చేసేలా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని, అదే తరహాలో ఇక్కడ వైద్యసేవలు నిరంతరం అందాలని ప్రజలతో పాటు ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. అందుకు తగ్గట్లుగా ఎంజీఎం డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని, అందుకే ఎంజీఎంలు అత్యవసర, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యసవర విభాగంలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ ద్వారా అత్యవసర చికిత్సలు అందించేందుకు వీలవుతుందన్నారు.

ఇప్పటికే ఆసుపత్రులో ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. పాత సెంట్రల్ జైలు స్థలంలో రూ.1100కోట్లతో 24 అంతస్తుల అత్యాధునిక మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని..అన్నారు.