Telangana : కేంద్ర ప్రభుత్వం తీరు అయితే జుమ్లా .. లేకుంటే హమ్లా అన్నట్లుగా ఉంది : కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం తీరు అయితే జుమ్లా..లేకుంటే హమ్లా అన్నట్లుగా ఉంది అంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్..

Telangana : కేంద్ర ప్రభుత్వం తీరు అయితే జుమ్లా .. లేకుంటే హమ్లా అన్నట్లుగా ఉంది : కేటీఆర్

Telangana, minister KTR, satires central government,'Jumla, hamla',

Telangana : కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలతో విరుచుకుపడే కేటీఆర్ ఈ సారి ‘జుమ్లా..హమ్లా’అంటూ సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం తీరు అయితే జుమ్లా..లేకుంటే హమ్లా అన్నట్లుగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మీడియా ఇన్ తెలంగాణ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ మీడియాలో పాజిటివ్ వార్తలు కంటే నెగిటివ్ వార్తలే ఎక్కువగా వస్తున్నాయని..సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన జర్నలిజం ఇటువంటి పోకడలు సరికాదని సూచించారు.

PM Modi In Telangana : తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా.. అవినీతి చేసేవారిని వదిలి పెట్టను : ప్రధాని మోడీ

కేంద్రం పాలన మానేసి ఎవరు ఏం తినాలి? ఎటువంటి దుస్తులు వేసుకోవాలి? ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు హిజాబ్ ధరించాలా? వద్దా?అని చెప్పే పనిలో బిజీగా ఉందని విమర్శించారు. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా బీజేపీ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం బాగా పెరిగిందని..30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది అంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనలతో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంతో దూసుకుపోతోందని ఇది యూసి బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతోందంటూ ఆరోపించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వటంలేదన్నారు. పెద్ద నోట్లను రద్దుతో దేశాన్ని బీజేపీ ప్రభుత్వం అధోగతిపాలు చేసిందని..విమర్శించారు. .నోట్ల చలామణి 15 లక్షల కోట్ల నుంచి 30 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు.

PM Modi In Telangana : నేను రోజుకు రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే అలిసిపోను : ప్రధాని మోడీ