కోలుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఛాతిలో నొప్పికి కారణం ఇదే

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గురువారం (మే

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 04:40 AM IST
కోలుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఛాతిలో నొప్పికి కారణం ఇదే

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గురువారం (మే

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గురువారం (మే 14,2020) అర్థరాత్రి మంత్రి సబితకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. కేర్‌ ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, ప్రస్తుతం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని కేర్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. మంత్రి సబిత ఆరోగ్య పరిస్థితిపై పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఆరా తీశారు. కొందరు నేతలు మంత్రిని పరామర్శించారు.

కాగా, చాతిలో నొప్పి రావడానికి కారణం ఏంటో డాక్టర్లు చెప్పారు. ఎసిడిటీ వల్ల పెయిన్ వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కాసేపట్లో సబితను డాక్టర్లు డిశ్చార్జ్ చేయనున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్యంపై విద్యాశాఖ మంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు చేశారని తెలిపింది. అన్ని పరీక్షలు రిపోర్టులు వచ్చాయని, అంతా నార్మల్ గానే ఉందని వివరించింది. సబితా ఇంద్రారెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

కాగా, మంత్రి సబిత ఆరోగ్యంపై పలువురు మంత్రులు, నేతలు.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మంత్రికి అస్వస్థత అనే వార్తతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందారు.

Read Here>> నేను బాగానే ఉన్నా : డైనమిక్ లీడర్ కేటీఆర్